LOADING...
GST 2.0: సాధారణ ప్రజలకు,రైతులకు శుభవార్త.. వీటి ధరలు తగ్గనున్నాయ్..
సాధారణ ప్రజలకు,రైతులకు శుభవార్త.. వీటి ధరలు తగ్గనున్నాయ్..

GST 2.0: సాధారణ ప్రజలకు,రైతులకు శుభవార్త.. వీటి ధరలు తగ్గనున్నాయ్..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
08:28 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పలు ముఖ్యమైన సంస్కరణలకు ఆమోదం లభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కొత్త స్లాబ్ రేట్లు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని నిర్ణయించారు. ఈ సంస్కరణల ప్రకారం 5%,18% స్లాబ్‌లు కొనసాగుతాయి. అయితే ఇప్పటివరకు ఉన్న 12%, 28% స్లాబ్‌లను తొలగించనున్నారు. ఇక లగ్జరీ వస్తువులపై 40% పన్ను విధించనున్నారు. ఈ మార్పులు సాధారణ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు కొంత ఉపశమనం కలిగిస్తాయని సీతారామన్ తెలిపారు. అలాగే, కౌన్సిల్‌ మరోసారి సెప్టెంబర్ 4న సమావేశం కానుంది.

వివరాలు 

ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు 

"సిన్ గూడ్స్" (సోడాలు, 50 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన లగ్జరీ కార్లు)పై 40% పన్ను విధింపు పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, చక్కెర కలిగిన గ్యాస్ పానీయాలపై 40% పన్ను అన్ని వ్యక్తిగత జీవిత బీమా పాలసీలకు జీఎస్టీ మినహాయింపు 28% నుంచి 18%కి తగ్గిన వస్తువులు సిమెంట్ 300 సీసీలలోపు చిన్న కార్లు, మోటార్ సైకిళ్లు బస్సులు, ట్రక్కులు, అంబులెన్సులు అన్ని ఆటోపార్ట్స్ ఆటోరిక్షాలు

వివరాలు 

18% స్లాబ్‌లోకి చేరిన వస్తువులు

ఎయిర్ కండిషనర్లు అన్ని రకాల టెలివిజన్లు డిష్ వాషింగ్ యంత్రాలు చిన్న కార్లు 300 సీసీలలోపు మోటార్ సైకిళ్లు 18% నుంచి 5%కి తగ్గిన వస్తువులు నమ్కీన్ భుజియా సాస్ పాస్తా ఇన్‌స్టంట్ నూడుల్స్ చాక్లెట్ కాఫీ ప్రిజర్వ్డ్ మాంసం వెన్న, నెయ్యి 5% కన్నా తక్కువగా పన్ను విధించనున్న వస్తువులు అల్ట్రా హై టెంపరేచర్ పాలు పనీర్ రోటీలు పరాటాలు

వివరాలు 

12% లేదా 18% నుంచి 5%కి తగ్గిన వస్తువులు

హెయిర్ ఆయిల్ సబ్బులు షాంపూలు టూత్ బ్రష్ టూత్ పేస్ట్ టేబుల్ వేర్ కిచెన్ వేర్ నూడుల్స్, పాస్తా, పలు ఆహార పదార్థాలు రొటీలూ సైకిళ్లు పలు ఔషధాలు మెడికల్ పరికరాలు వ్యవసాయ పరికరాలు