LOADING...
Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే
స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే

Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా అనేక ఆర్థిక పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఈ ధరల ఊగిసలాట కారణంగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారిలో కొంత అస్పష్టత నెలకొంది. వాస్తవానికి బంగారం,వెండి ధరలు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ విలువపై ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా, ద్రవ్యోల్బణం స్థాయి, వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారు నిల్వలు, వడ్డీ రేట్ల మార్పులు కూడా ఈ ధరలపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితుల్లో, జూన్ 11 (బుధవారం) న తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల పరిస్థితి ఏవిధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం నాటి బంగారం ధరలు 

హైదరాబాద్ లో పసిడి ధర మంగళవారం వలెనే బుధవారం కూడా స్వల్పంగా తగ్గింది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,440, కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 97,570 గా ఉంది. ఇదే ధరలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాలైన విశాఖపట్టణం, రాజమండ్రి, విజయవాడ, పొద్దుటూరు, వరంగల్ లాంటి ప్రాంతాల్లోనూ కొనసాగుతున్నాయి.

వివరాలు 

భారతదేశంలోని ఇతర ముఖ్య నగరాల్లో బంగారం ధరలు 

ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,570 22 క్యారెట్ల ధర రూ. 89,440 ఢిల్లీ: 24 క్యారెట్ల ధర రూ. 97,720 22 క్యారెట్ల ధర రూ. 89,590 చెన్నై: 24 క్యారెట్ల బంగారం ధర రూ. 97,570 22 క్యారెట్ల ధర రూ. 89,440 బెంగళూరు, కేరళ, కోల్కతా, పూణే వంటి నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వివరాలు 

జూన్ 11న వెండి ధరల స్థితి 

వెండి ప్రాచీనకాలం నుంచే విలువైన లోహంగా గుర్తింపు పొందింది. ఇది ఆభరణాల తయారీతోపాటు నాణేలు,వంట పాత్రలు,ఇంకా రసాయనిక చర్యల్లో ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతోంది. ఇటీవలి కాలంలో వెండిని బంగారంతో పాటు ఒక పెట్టుబడిగా భావించడమే కాక,వినియోగదారులు దాని కొనుగోలుపై ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 11 (బుధవారం) న వెండి ధర ఎలా ఉందంటే,బంగారం ధర కాస్త తగ్గుతుండగా, వెండి ధర మాత్రం ఊహించని విధంగా పెరిగింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో,కేజీ వెండి ధర రూ.100 పెరిగి,రూ. 1,19,100 కి చేరుకుంది. హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ఇదే స్థాయిలో వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఈ ధరలు మార్కెట్ పరిస్థితులను బట్టి మారవచ్చు కనుక, కొనుగోలు ముందు తాజా ధరలను పరిశీలించడం ఉత్తమం.