Page Loader
Gold Rates: మళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలు.. కొందామా.. ఆగుదామా? 
మళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలు.. కొందామా.. ఆగుదామా?

Gold Rates: మళ్ళీ పెరుగుతున్న బంగారం ధరలు.. కొందామా.. ఆగుదామా? 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 07, 2024
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం బంగారం ధరలు మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైమ్‌ హైల్లో ఉన్నాయి. 24 క్యారెట్ (99.9% స్వచ్ఛత) 10 గ్రాముల బంగారం ధర రూ. 78,450గా నమోదైంది. గత కొద్ది రోజులుగా పుత్తడి విలువ నిత్యం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సగటు మధ్యతరగతి వర్గానికి పసిడి కొనుగోళ్లపై సందిగ్ధత ఏర్పడింది. కొందరు కొనుక్కోవాలని, మరికొందరు ఆగాలనుకుంటున్నారు, దీంతో కొనుగోలుదారులలో గందరగోళం నెలకొంది.

వివరాలు 

పండుగ సీజన్‌లో పెరుగుతున్న ధరలు 

ఈ పండుగ సీజన్‌లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్కువ మంది నిపుణులు అంచనా వేస్తున్నారు. నవరాత్రులు, దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి వంటి పండుగల నేపథ్యంలో మార్కెట్‌లో డిమాండ్‌ అధికంగా ఉండబోతోంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్‌లో పెరిగే ముడి చమురు ధరలు, దేశీయ, విదేశీ స్టాక్ మార్కెట్ల పతనం ఇన్వెస్టర్లను బంగారం వైపు తిప్పిస్తున్నాయి. బంగారాన్ని రక్షణాత్మక పెట్టుబడిగా చూసే ఇన్వెస్టర్ల డిమాండ్‌ మార్కెట్‌లో ధరలను పెంచుతుంది. అందువల్ల మరో 3-4 నెలల వరకు గోల్డ్‌ రేట్లు తగ్గవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

కరెక్షన్‌ ఎప్పుడు? 

గోల్డ్‌ మార్కెట్‌లో ధరల కరెక్షన్‌ ఎప్పుడన్నదానికి పశ్చిమాసియాలో ఉన్న ఉద్రిక్తతలు చల్లబడాలని, స్టాక్‌ మార్కెట్లు లాభాల వైపు తిరిగి రావాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరల్లో 5 నుంచి 7 శాతం తగ్గవచ్చని వారు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద, మదుపరులు తమ పెట్టుబడులను స్టాక్స్‌, బాండ్ల వైపు మళ్లిస్తేనే గోల్డ్‌ రష్‌ తగ్గుతుంది. అందువల్ల, ఇప్పుడు బంగారం కొనుగోలు చేయడం పెద్దగా ప్రయోజనం కలిగించదు. అయితే, స్వల్పకాలంలో ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, కొని కొద్ది రోజుల తర్వాత అమ్ముకోవచ్చు అని సూచిస్తున్నారు. కానీ మార్కెట్‌ ట్రెండ్‌ను పరిగణలోకి తీసుకుని రిస్క్‌ను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.