
Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలి రెండు రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరిగిన నేపథ్యంలో,శుక్రవారం (మే 23) స్వల్పంగా తగ్గాయి.
ముఖ్యంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ.380 తగ్గుదల కనిపించగా,22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.350 తగ్గింది.
బులియన్ మార్కెట్‌లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,400గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.97,530కి చేరింది.
అయితే, ప్రాంతానుసారం ధరల్లో తేడాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.97,530గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.89,400గా ఉంది.
అదే విధంగా, చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి.
వివరాలు
ఢిల్లీలో మాత్రం ధరలు కొంచెం ఎక్కువ
అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ధరలు కొంచెం ఎక్కువగా ఉండటం గమనార్హం.
అక్కడ 24 క్యారెట్ల బంగారం 10గ్రాములకు రూ.97,680గా,22క్యారెట్ల ధర రూ.89,550గా ఉంది.
ఇక వెండి ధర విషయానికి వస్తే..బంగారం తరహాలోనే వెండి ధరలో కూడా తగ్గుదల చోటు చేసుకుంది.
గత రెండు రోజుల్లో పెరిగిన వెండి ధర నేడు రూ.1,000తగ్గింది.బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,00,000గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో కిలో వెండి ధర రూ.1,11,000గా ఉండగా,ముంబై,ఢిల్లీ,బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర లక్ష రూపాయలుగా ఉంది.
ఈ ధరలు మే 23వ తేదీ ఉదయం 10 గంటల వరకు పలు ప్రముఖ వెబ్‌సైట్లలో నమోదు అయిన తాజా వివరాల ప్రకారం వెల్లడయ్యాయి.