Page Loader
Gold Rate: అంతర్జాతీయంగా బంగారం రూ.లక్ష దాటింది.. భారత్‌లో కూడా చరిత్ర సృష్టిస్తుందా?
అంతర్జాతీయంగా బంగారం రూ.లక్ష దాటింది.. భారత్‌లో కూడా చరిత్ర సృష్టిస్తుందా?

Gold Rate: అంతర్జాతీయంగా బంగారం రూ.లక్ష దాటింది.. భారత్‌లో కూడా చరిత్ర సృష్టిస్తుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 22, 2025
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్స్‌ ధర 3404 డాలర్లను తాకింది. ఔన్స్ అంటే సుమారు 29 గ్రాములు. ఈ లెక్కను రూపాయల్లోకి మారిస్తే, పది గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర సుమారు లక్ష రూపాయలు అయినట్లు అర్థమవుతోంది. అయితే దేశీయంగా ఈ స్థాయికి ధరలు చేరకపోయినా బంగారం రేట్లు గణనీయంగా పెరిగాయి. బెంగళూరులో అత్యధికంగా రూ.99,860 కు బంగారాన్ని విక్రయిస్తున్నారు. మిగిలిన నగరాల్లో ధరలు రూ.98,000 నుంచి రూ.99,500 మధ్యలో ఉన్నాయి.

Details

అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలే కారణం

బంగారం ధరల పెరుగుదలకు ప్రధానంగా అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలే కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం చైనాపై కొత్త ఎగుమతి నియంత్రణలు విధించడంతో వాణిజ్య యుద్ధ భయాలు మరింత తీవ్రంగా మారాయి. ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం కీలకమైన ఖనిజాలపై సుంకాలు విధించేందుకు అధ్యయనాలు ప్రారంభించగా, బుధవారం నాటికి చైనా నుండి దిగుమతయ్యే అనేక వస్తువులపై అమెరికా 245 శాతం సుంకాలు విధించింది. యూఎస్ డాలర్ ఇండెక్స్ 100 మార్క్ దిగువకు పడిపోవడం కూడా బంగారం విలువను మరింత పెంచిన అంశంగా భావిస్తున్నారు. ఫలితంగా పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు.

Details

ఇప్పట్లో ధరలు తగ్గే ఛాన్స్ లేదు

అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, సమీప భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ట్రంప్ నిర్ణయాలు మార్కెట్‌లో అనిశ్చితిని కలిగిస్తున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో బంగారం విలువ మరింత పెరిగే అవకాశముంది. డిమాండ్ పెరుగుతున్నా, గనుల్లో ఉత్పత్తి స్థిరంగానే ఉండటంతో సరఫరా లోటు వల్ల రేట్లు పెరిగే పరిస్థితి నెలకొన్నట్లు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.