Page Loader
Gold Rate Today: మహిళలకు అదిరే శుభవార్త.. వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధర 
మహిళలకు అదిరే శుభవార్త.. వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధర

Gold Rate Today: మహిళలకు అదిరే శుభవార్త.. వరుసగా మూడో రోజూ తగ్గిన బంగారం ధర 

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
12:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు నిత్యం తగ్గుతూ వస్తున్నాయి. వరుసగా మూడో రోజు కూడా ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. పసిడి కొనాలనుకునే వారికి, ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇటీవల బంగారం, వెండి రేట్లు అత్యధిక స్థాయికి చేరుకోవడంతో చాలామంది కొనుగోలు చేయకుండా వెనక్కి తగ్గారు. అటువంటి వారికి ఇప్పుడున్న ధరల తగ్గుదల ఒక బంగారు అవకాశంగా చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు అమలు నిర్ణయాన్ని వాయిదా వేసిన నేపథ్యం,ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్న తరుణంలో అంతర్జాతీయ స్థాయిలో అనిశ్చితి పరిస్థితులు సర్దుకుంటున్నాయి.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర.. 

అంతేగాక, భూభాగ సంబంధిత ఉద్రిక్తతలు కూడా తగ్గుముఖం పడటంతో పెట్టుబడిదారులు పసిడి కాకుండా ఇతర పెట్టుబడి మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారంపై డిమాండ్ తగ్గి, ధరలు పడిపోతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, మే 29న హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. గ్లోబల్ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. గత రోజుతో పోల్చితే స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 80 డాలర్లు తగ్గింది. ప్రస్తుతానికి ఔన్స్ గోల్డ్ ధర సుమారు 3,250డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో స్పాట్ సిల్వర్ ధర ఒక్క ఔన్స్‌కు 32.96 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వివరాలు 

హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధర.. 

ఇక రూపాయి విలువ ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూ.85.466 వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా పసిడి ధరలు వరుసగా మూడోరోజూ పడిపోయాయి. మే 29న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.10 మేర తగ్గింది. చివరి మూడురోజుల్లో మొత్తం తగ్గుదల రూ.610 వరకు నమోదైంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం తులం ధర రూ.97,470గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం ధర రూ.89,340గా కొనసాగుతోంది.

వివరాలు 

స్థిరంగానే వెండి ధర.. 

పసిడి ధరలు తగ్గుతుండగా, వెండి మాత్రం తాత్కాలికంగా స్థిరంగా కొనసాగుతోంది. గత రోజులో కొద్దిగా తగ్గినప్పటికీ, మే 29న అదే స్థాయిలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర కిలోకు రూ.1,11,000 వద్ద కొనసాగుతోంది.