Page Loader
Central Scheme: తెల్లరేషన్ కార్డుదారులకు త్వరలో గుడ్ న్యూస్.. రేషన్ స్కీం క్రింద బియ్యంతో పాటు ఈ 9 సరుకులు ఫ్రీ.. 
తెల్లరేషన్ కార్డుదారులకు రేషన్ స్కీం క్రింద బియ్యంతో పాటు ఈ 9 సరుకులు ఫ్రీ..

Central Scheme: తెల్లరేషన్ కార్డుదారులకు త్వరలో గుడ్ న్యూస్.. రేషన్ స్కీం క్రింద బియ్యంతో పాటు ఈ 9 సరుకులు ఫ్రీ.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2024
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్ధిదారుల కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ రేషన్ కార్డు ఉన్నవారికి 9 రకాల నిత్యావసర వస్తువులు అందించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఉచిత రేషన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. దారిద్య్రరేఖకు దిగువన ఉన్ననిరుపేదలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రేషన్ కార్డులు అందిస్తున్నాయి,ప్రత్యేకంగా ఆహార భద్రత కోసం ఉచిత రేషన్ అందిస్తున్నారు. 90 కోట్ల మందికి ఉచిత రేషన్ కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన 90 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తోంది. ముఖ్యంగా కరోనాకాలంలో ప్రారంభించిన ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగిస్తోంది. ఇప్పుడు, కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు 9 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

వివరాలు 

9 సరుకులు పంపిణీ 

రాబోయే రోజుల్లో ఉచిత బియ్యంతో పాటు గోధుమలు, పప్పులు, ధాన్యాలు, చక్కెర, ఉప్పు, ఆవనూనె, పిండి, సోయాబీన్, మసాలా దినుసులు అందించనున్నట్లు సమాచారం. పేద ప్రజల ఆహారంలో పౌష్టికాహారాన్ని పెంచి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రేషన్ కార్డు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది, తద్వారా అర్హులైనవారు ఈ పథక ప్రయోజనాలు పొందగలుగుతారు.

వివరాలు 

రేషన్ కార్డు ఇలా తీసుకోండి..! 

మీరు రేషన్ కార్డుకు అర్హులై, ఇంకా కార్డు పొందకపోతే, దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మీ సమీప ఆహార,పౌర సరఫరా శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలి లేదా ఫుడ్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫార్మ్‌లో అన్ని వివరాలను ఖచ్చితంగా పూరించాలి. సంబంధిత డాక్యుమెంట్లు జత చేసి, రేషన్ కార్యాలయంలో సమర్పించాలి. ఆపై, మీ దరఖాస్తును అధికారి సమీక్షిస్తారు.

వివరాలు 

రేషన్ కార్డు ఇలా తీసుకోండి..! 

వివరాల పరిశీలన తర్వాత, రేషన్ కార్డు జారీ అవుతుంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఇంకా నియమాలు రూపొందించలేదు. అందువల్ల కొత్త కార్డులకు ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రజల కోసం అమలు చేస్తోంది, వాటిలో పేదలకు ప్రాధాన్యతనిచ్చే పథకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఉచిత రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఫ్రీ రేషన్ స్కీమ్ కింద, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత రేషన్ సరఫరా జరుగుతోంది.