
Nirmala Sitharaman: అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు: నిర్మలా సీతారామన్
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని 140 కోట్ల ప్రజలకు వర్తించే జీఎస్టీ (GST)పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయాలు ఈ నెల 22 నుంచి అమలులోకి రావనున్నాయని చెప్పారు. విశాఖపట్టణంలోని మధురవాడలో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన సమావేశంలో ఆమె ఈ విషయాలను వివరించారు.
వివరాలు
2017కి ముందు దేశంలో 17 రకాల పన్నులు
"ఇప్పటికే అనేక రంగాల్లో జీఎస్టీ ద్వారా ప్రజలకు ప్రయోజనాలు లభించాయి.పన్ను స్లాబ్‌లను నాలుగు నుంచి రెండు స్లాబ్‌లకు తగ్గించాము.12శాతం స్లాబ్‌లో ఉన్న వస్తువులలో దాదాపు 99శాతం వస్తువులను 5శాతం స్లాబ్‌లోకి తీసుకొచ్చాము. అలాగే 28శాతం స్లాబ్‌లో ఉన్న సిమెంట్ సహా 90 శాతం వస్తువులను 18 శాతం స్లాబ్‌లోకి మార్చాం. 2017కి ముందు దేశంలో 17 రకాల పన్నులు ఉండేవి, వాటిపై 8 రకాల సెస్సులు కూడా వర్తించేవి. ఉదాహరణకు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో వేరుగా ఉండేది. జీఎస్టీ పరిచయం ద్వారా వీటన్నింటిని ఒకే పన్ను కింద, నాలుగు స్లాబ్‌లలోకి మార్చాము" అని నిర్మలా సీతారామన్ చెప్పారు.
వివరాలు
శానిటరీ న్యాప్‌కిన్స్‌పై పన్నును పూర్తిగా రద్దు
2017-18 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా దేశానికి రూ.7.19 లక్షల కోట్ల ఆదాయం లభించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.22.08 లక్షల కోట్లకు చేరింది. జీఎస్టీ ప్రధాన ఉద్దేశ్యం ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించడం. పాలు,పెరుగు వంటి నిత్యావసర వస్తువులను 5 శాతం స్లాబ్ నుంచి సున్నా శాతం శ్రేణికి తీసుకువచ్చాము. మధ్యతరగతికి ఉపశమనం కలిగే విధంగా చర్యలు తీసుకున్నాం. కారు, ఫ్రిజ్, ఏసీ వంటి వస్తువుల పన్నును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాం. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి జీఎస్టీ కొత్త సంస్కరణలు పెద్ద తోడ్పాటుగా ఉంటాయి. మహిళల ఆరోగ్యం కోసం శానిటరీ న్యాప్‌కిన్స్‌పై పన్నును పూర్తిగా రద్దు చేసాం.
వివరాలు
30 శాతం పన్ను ఉన్న వస్తువులను ఇప్పుడు 5 శాతం స్లాబ్‌లోకి..
యూపీఏ ప్రభుత్వంలో 30 శాతం పన్ను ఉన్న వస్తువులను ఇప్పుడు 5 శాతం స్లాబ్‌లోకి తీసుకువచ్చాం. పన్ను విధానాన్ని సరళతగా రూపొందించని వారు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. గతంలో దేశంలో సుమారు 65 లక్షల పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. ఈ 8 ఏళ్లలో ఆ సంఖ్య 1.51 కోట్లకు చేరింది" అని నిర్మలా సీతారామన్ వివరించారు.