Madhabi Puri Buch: సెబీ ఛైర్‌పర్సన్ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించిన షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్
సెబీ ఛైర్‌పర్సన్ మాధవి పురీ బుచ్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తాజా ఆరోపణలపై షార్ట్‌సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ స్పందించింది. "మాధవిపై ఆరోపణలు వచ్చినా, ఆమె ఇంకా మౌనంగానే ఉంటోంది" అని బుధవారం హిండెన్‌బర్గ్ ఎక్స్‌లో పేర్కొంది. హిందెన్‌బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం, "మాధవికి 99 శాతం వాటాలున్న కన్సల్టింగ్ సంస్థ అనేక లిస్టెడ్ కంపెనీల నుంచి చెల్లింపులను స్వీకరించింది. ఈ కంపెనీలను సెబీ నియంత్రిస్తుంటుందన్న విషయం తెలిసిందే మాధవి సెబీ పూర్తిస్థాయి సభ్యురాలిగా ఉన్న సమయంలో ఈ చెల్లింపులు జరిగాయి.ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా,ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, పిడీలైట్ ఉన్నాయి. ప్రస్తుతం ఆరోపణలు మొత్తం ఆమె భారతీయ కన్సల్టింగ్ కంపెనీపైనే వస్తున్నాయి. సింగపుర్‌లోని సంస్థ వివరాలు ఇంకా బయటపడలేదు" అని పేర్కొంది.
మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి రూ.4.78కోట్ల ఆదాయం పొందిన దావల్
ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపణల ప్రకారం,మాధవి ప్రమోట్ చేసే సంస్థ రూ.3కోట్ల ఆదాయాన్ని సంపాదించిందని,ఇందులో ఎక్కువగా మహీంద్రా నుంచి వచ్చినట్లు తెలిపింది. మాధవి సెబీలో పూర్తిస్థాయి సభ్యురాలిగా ఉన్నప్పుడు ఈ ఆదాయం పొందినట్లు పేర్కొంది. అదే విధంగా,మాధవి భర్త దావల్,మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి రూ.4.78కోట్ల ఆదాయం పొందాడని కాంగ్రెస్ తెలిపింది. "మాధవి సెబీ బోర్డులో పూర్తిస్థాయి సభ్యురాలిగా ఉన్న సమయంలోనే ఆమె భర్త ఈ ఆదాయాన్ని పొందాడు"అని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఆరోపించారు. మరోవైపు, మహీంద్రా కంపెనీ ఈ ఆరోపణలను ఖండించింది."ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని ఇవి తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి"అని పేర్కొంది. మహీంద్రా తెలిపిన వివరాల ప్రకారం,ఆమె భర్త గతంతో పాటు ఇప్పటికి కూడా తమతో పనిచేస్తున్నట్లు పేర్కొంది.