Hyundai Motor India IPO: హ్యుందాయ్ ఐపీఓ.. సబ్‌స్క్రయిబ్ చేసుకునే ముందు మీరు తప్పక తెలుసుకోవలసిన 10 విషయాలు
దేశంలో అతిపెద్ద ఐపీఓలలో ఒకటిగా నిలిచిన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ మంగళవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ ఐపీఓ వివరాలు తెలుసుకోవడం కీలకం.
హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీ వివరాలు
హ్యుందాయ్ మోటార్ గ్రూప్ (హ్యుందాయ్, కియా) ప్రపంచంలో మూడవ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీదారుగా ఉంది. 2023లో ఈ సంస్థ 7.3 మిలియన్ల వాహనాలను విక్రయించింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ 1996 నుండి భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశంలో 13 ప్యాసింజర్ వాహన మోడళ్లు (సెడాన్, హ్యాచ్‌బ్యాక్, SUV, EV, CNG వాహనాలు) విక్రయిస్తోంది. భారతదేశం అంతటా 1,366 సేల్స్ పాయింట్లు, 1,550 సర్వీస్ పాయింట్లు నిర్వహిస్తూ, హ్యుందాయ్ ఇప్పటి వరకు దేశంలో 12 మిలియన్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ ప్యాసింజర్ వాహన మార్కెట్లో 2024 ఆర్థిక సంవత్సరం వరకు రెండవ అతిపెద్ద ఆటో కంపెనీగా ఉంది.
హ్యుందాయ్ ఐపీఓ - తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 10 విషయాలు
1. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ కోసం అక్టోబర్ 15 మంగళవారం ప్రారంభమై అక్టోబర్ 17, 2024న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం హ్యుందాయ్ ఐపీఓ అక్టోబర్ 14 సోమవారం ప్రారంభం కానుంది. హ్యుందాయ్ ఐపీఓ ప్రాతిపదికన షేర్ల కేటాయింపును అక్టోబర్ 18 శుక్రవారం ఖరారు చేస్తామని, అక్టోబర్ 21 సోమవారం కంపెనీ రీఫండ్స్ ప్రారంభిస్తుందని, అదే రోజు షేర్లను కేటాయింపుదారుల డీమ్యాట్ ఖాతాలో జమ చేస్తామని సంస్థ పేర్కొంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అవుతాయి. హ్యుందాయ్ షేర్లు అక్టోబర్ 22, 2024న స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
హ్యుందాయ్ ఐపీఓ - తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 10 విషయాలు
2. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ ప్రైస్ బ్యాండ్: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్‌ను ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరు (ఫేస్ వాల్యూ రూ.10) ధరను రూ.1,865 నుండి రూ.1,960 మధ్యలో నిర్ణయించారు. 3. హ్యుందాయ్ ఐపీఓ లాట్ సైజ్: ఒక అప్లికేషన్ కోసం కనీస లాట్ సైజ్ ఏడు షేర్లుగా నిర్ణయించారు. అంటే, ఇన్వెస్టర్లు కనీసం ఏడు షేర్లు లేదా దాని గుణకాల్లో బిడ్ వేయాలి. రీటైల్ ఇన్వెస్టర్లకు అవసరమైన కనీస పెట్టుబడి మొత్తం రూ.13,720.
హ్యుందాయ్ ఐపీఓ - తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 10 విషయాలు
4. హ్యుందాయ్ మోటార్ ఇండియా తన ఐపీఓ ద్వారా సుమారు 3.3 బిలియన్ డాలర్లు లేదా రూ. 27,870.16 కోట్లకు పైగా నిధులను సమీకరించాలని యోచిస్తోంది. ఈ ఐపీఓలో,హ్యుందాయ్ తన దక్షిణ కొరియా మాతృసంస్థకు చెందిన 142,194,700 (14.22 కోట్ల)షేర్లను లేదా మొత్తం యాజమాన్యంలోని యూనిట్‌లో 17.5 శాతం వాటాలను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో రీటైల్,ఇతర పెట్టుబడిదారులకు విక్రయిస్తోంది. ఈ బుక్ బిల్ట్ ఇష్యూ రూ.10 ఫేస్ వాల్యూ కలిగిన 14.22 కోట్ల షేర్లతో ఉంటుంది.ఐపీఓ అనంతరం కూడా దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థకు 82.5 శాతం వాటా కొనసాగుతుంది.
హ్యుందాయ్ ఐపీఓ - తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 10 విషయాలు
షేర్ల ధర శ్రేణిలో టాప్ ఎండ్‌లో ఉంటే,ఈ ఐపీఓ విలువ సుమారు 19 బిలియన్ డాలర్లు లేదా రూ. 15,954 కోట్లుగా ఉండొచ్చు, ఇది ఈ ఏడాదిలో దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఆఫర్ అవుతుంది. 5. హ్యుందాయ్ ఐపీఓ రిజర్వేషన్: నికర పబ్లిక్ ఇష్యూ సైజులో సగం (ఆఫర్ లెస్ ఎంప్లాయీస్ రిజర్వేషన్) అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు రిజర్వ్ చేశారు. ఇందులో 60 శాతం వరకు యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించే అవకాశం ఉంది. ఈ ఐపీఓలో 15 శాతం వాటాలు నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, మిగిలిన 35 శాతం షేర్లు రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. అదనంగా, కంపెనీ తన ఉద్యోగుల కోసం 7,78,400 ఈక్విటీ షేర్లను ప్రత్యేకంగా రిజర్వ్ చేసింది.
హ్యుందాయ్ ఐపీఓ - తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 10 విషయాలు
6. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ టార్గెట్స్: ప్రమోటర్-అమ్మకం వాటాదారుడు ఆఫర్-సంబంధిత ఖర్చులు, వర్తించే పన్నులను మినహాయించిన తరువాత,అన్ని ఆఫర్ ఆదాయాలను అందుకుంటారు.ఈ ఆదాయాన్ని చెల్లించడానికి ప్రమోటర్-అమ్మకం వాటాదారు బాధ్యత వహిస్తాడు. ఈ ఆఫర్ ద్వారా వచ్చే ఆదాయంలో కంపెనీకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. 7. హ్యుందాయ్ ఐపీఓ లీడ్ మేనేజర్, రిజిస్ట్రార్: ప్రధాన బోర్డు ఐపీఓ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లు (బీఎల్ఆర్ఎంలు)అనగా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్,సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేపీ మోర్గాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,మోర్గాన్ స్టాన్లీ ఇండియా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, కెఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కీలక ఇష్యూ రిజిస్ట్రార్‌గా ఉన్నాయి.
హ్యుందాయ్ ఐపీఓ - తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 10 విషయాలు
8. హ్యుందాయ్ ఐపీఓ రిస్క్స్: హ్యుందాయ్ మోటార్స్ తన విడిభాగాలు, మెటీరియల్స్ కోసం పరిమిత సంఖ్యలో సరఫరాదారులపై ఆధారపడి ఉంది. ఈ కంపెనీకి అవసరమైన విడిభాగాలు, సామగ్రి ధరల పెరుగుదల వ్యాపారానికి, కార్యకలాపాల ఫలితాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. విడిభాగాలు, మెటీరియల్ లభ్యతలో జరిగే ఎలాంటి అంతరాయాలు, దాని కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. 9. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ లిస్టెడ్ పీర్స్: ఆర్‌హెచ్‌పీ ప్రకారం, కంపెనీ లిస్టెడ్ సహచరులు.. మారుతీ సుజుకీ ఇండియా (అక్టోబర్ 4, 2024 నాటికి 17.93 పీ/ఈతో), టాటా మోటార్స్ లిమిటెడ్ (11.36 పీ /ఈతో), మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) (29.96 పీ /ఈతో).
హ్యుందాయ్ ఐపీఓ - తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 10 విషయాలు
10. హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ తాజా జీఎంపీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ జీఎంపీ నేడు +60 గా నమోదైంది. గ్రే మార్కెట్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా షేరు ధర రూ.60 ప్రీమియం వద్ద ట్రేడవుతోంది అని investorgain.com తెలిపింది. ఐపీఓ ధర బ్యాండ్ పై భాగంలో ఉన్నది, గ్రే మార్కెట్లో ప్రస్తుత ప్రీమియంను పరిగణనలోకి తీసుకుంటే, హ్యుందాయ్ మోటార్ ఇండియా షేరు ధర రూ.2,020 వద్ద లిస్ట్ అవ్వొచ్చు. ఇది ఐపీఓ ధర రూ.1,960 కంటే 3.06 శాతం ఎక్కువ.