Stock market: కేంద్ర బడ్జెట్ ప్రభావం.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతున్నాయి.
2025-26 ఆర్థిక సంవత్సరానికై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు లాభాల్లో కదలాడిన సూచీలు, ఆమె ప్రసంగం సందర్భంగా లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి.
బడ్జెట్ అనంతరం మార్కెట్ నష్టాల బాట పట్టింది. 12:50 గంటల సమయంలో సెన్సెక్స్ 220 పాయింట్లకు పైగా నష్టపోయి ట్రేడవుతుండగా, నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో కదలాడుతోంది.
పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రకటించిన పథకం కారణంగా అగ్రి స్టాక్స్ రాణించాయి.
అలాగే, క్లీన్‌టెక్ మిషన్ కింద సోలార్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV), బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించడంతో సంబంధిత రంగాల షేర్లు లాభపడ్డాయి.
వివరాలు
డ్జెట్ సమాప్తమయ్యే సరికి సూచీలు నష్టాల్లోకి..
బీమా రంగంలో ప్రస్తుతం 74 శాతంగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని 100 శాతానికి పెంచడంతో స్టార్‌హెల్త్ షేర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి.
అయితే, బడ్జెట్ సమాప్తమయ్యే సరికి సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.
సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
మరోవైపు, జొమాటో, మారుతీ సుజుకీ, హెచ్‌యూఎల్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్‌ఎం, టైటాన్, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.