LOADING...
Trade Negotiations: భారత్-అమెరికా మధ్య ట్రేడ్ ఒప్పందంపై వచ్చే 21 రోజుల్లో చర్చలకు అవకాశాలు : ప్రభుత్వ వర్గాలు
భారత్-అమెరికా మధ్య ట్రేడ్ ఒప్పందంపై వచ్చే 21 రోజుల్లో చర్చలకు అవకాశాలు

Trade Negotiations: భారత్-అమెరికా మధ్య ట్రేడ్ ఒప్పందంపై వచ్చే 21 రోజుల్లో చర్చలకు అవకాశాలు : ప్రభుత్వ వర్గాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2025
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై పరిష్కారాన్ని కనుగొనేందుకు చర్చలు జరిపేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ వర్గాలు CNBC-TV18 కు తెలిపారు. "ఇంకా 21 రోజులు ఉండటంతో అదనపు టారిఫ్‌లపై చర్చలు జరిపే అవకాశముంది," అని వారు తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) దృష్టిలో ఉంచుకొని, నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కార మార్గం కనిపెట్టేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు. "ఇరు దేశాలకు లాభకరంగా ఉండే పరిష్కారాన్ని కనుగొనడంపైనే భారత్ ఆశలు పెట్టుకుంది," అని వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వ్యాఖ్యలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం (ఆగస్టు 6) భారత్‌పై అదనపు 25% ad valorem tariff లు విధించిన నేపథ్యంలో వచ్చాయి.

వివరాలు 

 భారత్‌పై విధించిన మొత్తం టారిఫ్‌లు 50%

రష్యా నుండి చమురు దిగుమతుల వల్ల ఉక్రెయిన్‌తో యుద్ధానికి ఇంధనం అందుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ తాజా నిర్ణయంతో కలిపి అమెరికా భారత్‌పై విధించిన మొత్తం టారిఫ్‌లు 50%కి చేరాయి. ఈ టారిఫ్‌లు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయని నివేదికలు తెలుపుతున్నాయి. బ్రెజిల్‌పైనా 50% టారిఫ్‌లు ఆగష్టు 6నుండి అమలులోకి వచ్చాయి. అయితే, ట్రంప్‌ విధించిన అదనపు టారిఫ్‌ల వెనక కేవలం రష్యా చమురు కొనుగోలు మాత్రమే కారణం కాదు అనేది భారత్ భావన. దీంతో అమెరికాతో ఉన్న సంబంధాలను దీర్ఘకాలికంగా మెరుగుపరచుకునే దిశగా చూస్తోంది.

వివరాలు 

అమెరికా నుండి ఆయిల్ దిగుమతులు సుమారుగా 120 శాతం పెరిగాయి

"గత కొన్ని నెలలుగా భారత ఆయిల్ కంపెనీలు అమెరికా నుండి కూడా భారీగా చమురు కొనుగోలు చేస్తున్నాయి." "గత ఆరు నెలల్లో అమెరికా నుండి ఆయిల్ దిగుమతులు సుమారుగా 120 శాతం పెరిగాయి," అని వారు తెలిపారు. "భారత ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా చమురును అతి తక్కువ ధరలకు ఎక్కడ దొరికినా కొనుగోలు చేస్తున్నాయి." "భారత-అమెరికా సంబంధాలు దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో దీన్ని దీర్ఘకాలికంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది," అని వర్గాలు అన్నారు. "ఇప్పటికే భారత PSUs అమెరికా కంపెనీల నుండి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయి. ఈ కొనుగోలు ఇంకా పెరుగుతుందన్న విశ్వాసం ఉంది" అని పేర్కొన్నారు.