Sam Altman: AI కోసం భారతదేశం ఒక అద్భుతమైన మార్కెట్.. ఓపెన్ఏఐ CEO సామ్ ఆల్ట్‌మాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఓపెన్‌ఏఐకి చెందిన ఎ.ఐ. చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT)ను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉపయోగిస్తున్నారు.
గత సంవత్సరం భారతదేశంలో ఈ యూజర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది.
ఈ విషయాన్ని ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ (Sam Altman) వెల్లడించారు.
చాట్‌జీపీటీకు భారతదేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్ అని ఆయన పేర్కొన్నారు.
సామ్ ఆల్ట్‌మాన్ ప్రపంచవ్యాప్తంగా సుడిగాలిగా పర్యటన చేస్తున్న సమయంలో, మంగళవారం రాత్రి భారత్ చేరుకున్నారు.
వివరాలు
భారత్.. ఎ.ఐ. విప్లవాత్మక ప్రపంచంలో నాయకత్వాన్ని చేపట్టాలి
ఈ సందర్భంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన,ఈ వ్యాఖ్యలు చేశారు,
"భారతదేశంలో ప్రజలు ఎక్కువగా స్టాక్, చిప్స్,మోడల్స్ వంటి అద్భుతమైన అప్లికేషన్లపై దృష్టి పెట్టుతున్నారు. దేశం ప్రతి విషయంలోనూ వేగంగా ముందుకు సాగుతోంది.ఇక్కడి ప్రజలు చేసే అద్భుతాలను చూస్తుంటే, నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. భవిష్యత్తులో భారత్.. ఎ.ఐ. విప్లవాత్మక ప్రపంచంలో నాయకత్వాన్ని చేపట్టాలి" అని ఆయన ఆకాంక్షించారు.
ఏఐ మోడల్స్ నిర్మాణ ఖర్చుల తగ్గింపుపై ఎదురైన ప్రశ్నకు ఆయన స్పందించారు.
"ప్రస్తుతం మనం ఉజ్వల ప్రగతి సాధిస్తున్న ప్రపంచంలో ఉన్నాం.చిన్నపాటి అంశాలతో పెద్ద ఘనతలు సాధించే దిశగా ముందడుగు వేస్తున్నాం.ఇది చిన్న విషయం కాదు;ఇది చాలా విలువైనది. సృజనాత్మక ఆలోచనలకు ఇది పునాది ఏర్పరుస్తుంది.ఈ దిశగా భారతదేశం అగ్రగామిగా నిలబడాలి" అని ఆయన తెలిపారు.