సహకారమే లక్ష్యంగా బ్రిక్స్ స్టార్టప్ ఫోరమ్‌ను ప్రారంభించనున్న భారత్
ఈ వార్తాకథనం ఏంటి
పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, వ్యవస్థాపకుల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి భారతదేశం ఈ ఏడాది బ్రిక్స్(BRICS) స్టార్టప్ ఫోరమ్‌ను ప్రారంభించనుంది.
ఈ విషయాన్ని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు.
బ్రిక్స్ సమ్మిట్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్య దేశాలుగా ఉన్నాయి.
బ్రిక్స్ దేశాల పరిశ్రమ శాఖ మంత్రుల 7వ వార్షిక సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వ స్టార్టప్ ఇండియా చొరవ వల్ల దేశంలో లక్ష స్టార్టప్‌లను ఏర్పాటైనట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో భారత్‌తో ఇతర బ్రిక్స్ దేశా సభ్యులకు తమ ప్రభుత్వం సహకరించేందుకు స్టార్టప్ ఫోరమ్‌ను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.
బ్రిక్స్
అంతర్జాతీయ సమాజానికి స్టార్టప్ ఫోరమ్ మద్దతుగా నిలుస్తుంది: పీయూష్
బ్రిక్స్ సభ్య దేశాలకే కాకుండా, అంతర్జాతీయ సమాజానికి స్టార్టప్ ఫోరమ్ మద్దతుగా నిలుస్తుందని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది 'వసుధైక కుటుంబం' పట్ల భారత్ నిబద్ధతకు నిదర్శనం అన్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షతన వర్చువల్‌గా సమావేశంలో బ్రిక్స్ దేశాల పరిశ్రమల మంత్రులు సంయుక్త ప్రకటనను ఆమోదించినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
బ్రిక్స్ దేశాల్లో డిజిటలైజేషన్, పారిశ్రామికీకరణ, ఆవిష్కరణలు, పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని మంత్రులు నొక్కి చెప్పారు.
మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యం పెంపుదల, రీ-స్కిల్లింగ్‌కు సంబంధించిన కార్యక్రమాలపై సహకారం కోసం అవకాశాలను అన్వేషించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసారు.