LOADING...
India Russian Oil Imports: రష్యా నుంచి చమురు దిగుమతులను మరింత పెంచాలని భారత్‌ నిర్ణయం..
రష్యా నుంచి చమురు దిగుమతులను మరింత పెంచాలని భారత్‌ నిర్ణయం..

India Russian Oil Imports: రష్యా నుంచి చమురు దిగుమతులను మరింత పెంచాలని భారత్‌ నిర్ణయం..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
08:09 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గతంలో 25 శాతం టారీఫ్స్ విధించగా.. ఆ తర్వాత అదనంగా మరో 25 శాతం జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా భారత్‌పై 50 శాతం టారిఫ్‌లు విధించబోతున్నట్లు స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ ముడి చమురును పెద్దఎత్తున దిగుమతి చేసుకుని లాభాలు పొందుతోందని ఆరోపిస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామంలో భారత్‌ను అమెరికా విమర్శిస్తున్నా.. నిశ్శబ్దంగా ఉండకుండా ఇండియా కూడా సమాధానమిస్తోంది. రష్యా నుంచి భారత్ మాత్రమే కాదు,అమెరికా,యూరోపియన్ యూనియన్ దేశాలే కాకుండా మరెన్నో దేశాలు కూడా విస్తారంగా దిగుమతులు చేస్తున్నాయని భారత్ ఆరోపించింది.

వివరాలు 

సెప్టెంబర్‌లో ఈ దిగుమతులు 10 నుంచి 20 శాతం వరకు పెంచే అవకాశం.. 

ఈనేపథ్యంలో ట్రంప్ నిర్ణయంపై సోషల్ మీడియాలో ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే అమెరికా ఆంక్షలతో భారత్ వెనక్కి తగ్గబోదన్న సంకేతాలు ఇస్తోంది.రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించడం కాదు,మరింత పెంచాలని భారత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ నాటికి ఈ దిగుమతులను 10 నుంచి 20శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే,రోజుకు అదనంగా సుమారు మూడులక్షల బ్యారెల్స్‌ చమురు కొనుగోలు చేయాలని భారత్ ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం భారత్ రష్యా నుంచి దాదాపు 40శాతం క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. అంతేకాక,రష్యా ఒక బ్యారెల్‌పై 2 నుంచి 3 డాలర్ల డిస్కౌంట్ కూడా అందజేస్తున్నందున,భారత్‌కు ఈ కొనుగోళ్లు మరింత లాభదాయకంగా మారుతున్నాయి.