
Modi-Trump: అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్నాయి.. చీఫ్ నెగోషియేటర్ రాజేష్ అగర్వాల్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గురువారం వెల్లడించారు. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి అగర్వాల్ ప్రధాన మధ్యవర్తిగా ఉన్నారు. ఇప్పటికే ఆయన అనేకసార్లు అమెరికాతో చర్చలు జరిపారు. సమగ్ర ఒప్పందానికి త్వరలోనే ముగింపు వచ్చే అవకాశం కనిపిస్తోందని సంకేతాలు ఉన్నాయి. యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువు ఈ జూలై 9న ముగిసినప్పటికీ, కొన్ని దేశాలకు ఆగస్టు 1 వరకు గడువు పొడిగించారు. అమెరికా మాత్రం భారత్‌లో వ్యవసాయ, పాడి పరిశ్రమలపై మినహాయింపులు కోరుతోంది. అయితే ఈ రంగాలు భారతదేశంలో భావోద్వేగాలకు దారితీసే అంశాలు కావడంతో, ఇరు దేశాల మధ్య చర్చలు కొంత అనిశ్చితిలో పడిపోయాయి.
వివరాలు
యూరోపియన్ యూనియన్‌తో చర్చలు
ఇటీవల జరిగిన ఎగుమతి లాజిస్టిక్స్ కార్యక్రమంలో మాట్లాడిన రాజేష్ అగర్వాల్, ఈ అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం సాధించడానికి భారత్ యత్నిస్తున్నదని తెలిపారు. ఈ ఒప్పందం తొలి దశను సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. భారత్ ఇప్పటికే 26 దేశాలతో 14కిపైగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు అమలులోకి తెచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ప్రధాన అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం కుదుర్చుకునే దిశగా ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే బ్రిటన్‌తో ఒప్పందం ముగించామని పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్‌తో కూడా చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు.
వివరాలు
న్యూజిలాండ్‌తో చర్చలు
అలాగే, లాటిన్ అమెరికాలోని చిలీ, పెరూ వంటి దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు సాగుతున్నాయని తెలిపారు. భారత్ ఇప్పటికే ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లతో ఒప్పందాలు చేసుకుందని, న్యూజిలాండ్‌తో చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో వ్యాప్తిలో ఉండే వాణిజ్య ఒప్పందాలను సాధించేందుకు భారత్ యత్నిస్తున్నదని వివరించారు.
వివరాలు
బ్రిటన్, వియత్నాం మాత్రమేఅమెరికాతో ఒప్పందాలు
గత ఏప్రిల్ 2న ట్రంప్ ప్రభుత్వం కొన్ని దేశాలపై దిగుమతి సుంకాలు విధించింది. అయితే ఆయా దేశాల నిరసనల నేపథ్యంలో మూడు నెలల పాటు ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. కానీ ఆ గడువు జూలై 9తో ముగిసింది. అమెరికా ఇప్పటివరకు రెండు మిత్రదేశాలపై సుంకాలు అమలు చేసింది. మిగిలిన దేశాలకు మాత్రం ఆగస్టు 1 వరకు గడువు ఇచ్చి,అప్పటి లోపు వాణిజ్య ఒప్పందాలపై అంగీకారం కుదుర్చుకోవాలని సూచించింది. ప్రస్తుతం అమెరికాతో బ్రిటన్, వియత్నాం మాత్రమే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. చైనా మాత్రం పరస్పరం తాత్కాలింగా తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి.