Page Loader
 Jeff Bezos: ప్రపంచ సంపన్న వ్యక్తుల జాబితాలో రెండో స్థానం కోల్పోయిన జెఫ్‌ బెజోస్‌
ప్రపంచ సంపన్న వ్యక్తుల జాబితాలో రెండో స్థానం కోల్పోయిన జెఫ్‌ బెజోస్‌

 Jeff Bezos: ప్రపంచ సంపన్న వ్యక్తుల జాబితాలో రెండో స్థానం కోల్పోయిన జెఫ్‌ బెజోస్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ ఇకపై ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడు కాదు. ఆయన స్థానాన్ని ఒరాకిల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్‌ ఆక్రమించారు. ప్రస్తుతం ఎల్లిసన్‌ సంపద 243 బిలియన్‌ డాలర్లకు చేరుకుని,ఫోర్బ్స్ విడుదల చేసిన వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో ఒరాకిల్‌ సంస్థ అంచనాలకన్నా ఎక్కువగా ఆదాయం,లాభాలు ఆర్జించింది. కంపెనీ అభివృద్ధి ఆశించిన దానికంటే మెరుగ్గా ఉండటంతో షేర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. గురువారం మార్కెట్ ట్రేడింగ్ సమయంలో ఒరాకిల్‌ షేరు ధర ఏకంగా 13శాతం పెరిగింది. ఫలితంగా ఆ కంపెనీ షేరు ధర తొలిసారిగా 200 డాలర్లను తాకింది. దీనివల్ల ఒక్కరోజులోనే లారీ ఎల్లిసన్‌ సంపద 26 బిలియన్‌ డాలర్లు పెరిగింది.

వివరాలు 

407 బిలియన్‌ డాలర్లతో మొదటి స్థానంలో ఎలాన్ మస్క్‌

మొత్తం గానూ ఆయన సంపద 243 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఫోర్బ్స్ ప్రకారం, ప్రస్తుతం జెఫ్ బెజోస్‌ సంపద 228 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మెటా సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద 239 బిలియన్‌ డాలర్లుగా ఉన్నా, లారీ ఎల్లిసన్‌ వీరిని మించి రెండో స్థానాన్ని అధిరోహించారు. ఇదే జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌ 407 బిలియన్‌ డాలర్లతో మొదటి స్థానాన్ని కొనసాగిస్తున్నారు.