Page Loader
Jeff Bezos: $3B విలువైన అమెజాన్ షేర్లను విక్రయించిన జెఫ్ బెజోస్.. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానం 
$3B విలువైన అమెజాన్ షేర్లను విక్రయించిన జెఫ్ బెజోస్..

Jeff Bezos: $3B విలువైన అమెజాన్ షేర్లను విక్రయించిన జెఫ్ బెజోస్.. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానం 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2024
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ (Jeff Bezos) తన ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన మరో ముఖ్యమైన వాటాను విక్రయించారు. అమెజాన్‌కు చెందిన రూ. 25,000 కోట్ల (3 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను విక్రయించారని కంపెనీ విడుదల చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించారు. ఈ ప్రకటనతో పాటు, ఇప్పటివరకు ఆయన అమెజాన్‌లో 13 బిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లను విక్రయించారని ఫైలింగ్ పేర్కొంది. అంటే, 16 మిలియన్లకు పైగా షేర్లను అమ్మినట్లు తెలుస్తోంది.

వివరాలు 

అగ్రస్థానంలో ఎలాన్ మస్క్

అమెజాన్ ఇటీవల ప్రకటించిన మూడో త్రైమాసిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించి ఉన్నాయంటే,కంపెనీకి మంచి వృద్ధిని చూపించాయి. ఈ నేపథ్యంలో అమెజాన్‌ షేర్ల ధరలు భారీగా పెరిగాయి.ఒక్కో షేరుకు 200 డాలర్ల విలువను తాకాయి. గతేడాది కంటే అమెజాన్‌ స్టాక్‌ 40శాతానికి మించి లాభం పొందింది.ఫలితంగా,బెజోస్‌ సంపద పెరిగింది,ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నారు. మొదటి స్థానంలో ఎలాన్ మస్క్ ఉన్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం,ప్రస్తుతం 262 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉన్నారు. జెఫ్ బెజోస్‌ సంపద 222 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఈ సంవత్సరానికి 42.8బిలియన్ డాలర్లు పెరిగింది.మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ 201 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు.