Page Loader
LPG Price : క్రిస్మస్ ముంగిట గుడ్‌ న్యూస్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎంత తగ్గిందో తెలుసా 
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎంత తగ్గిందో తెలుసా

LPG Price : క్రిస్మస్ ముంగిట గుడ్‌ న్యూస్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఎంత తగ్గిందో తెలుసా 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
(PTI డెస్క్)
Dec 22, 2023
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రిస్ మస్ పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది.ఈ మేరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించిన కొత్త రేట్లను ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశాయి. 19కేజీల వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. నూతన సంవత్సరం, క్రిస్ మస్ వేడుకల సందర్భంగా నాలుగు మెట్రో నగరాల్లో 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి. దిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఒక్కో సిలిండర్ పై రూ.39.50 మేర తగ్గిస్తున్నట్లు పేర్కొన్నాయి. తగ్గించిన కొత్త రేట్లు డిసెంబర్ 22 నుంచే అమల్లోకి తెచ్చినట్లు చెప్పాయి.

details

ప్రతి నెల మొదటి రోజున చమురు సంస్థలు సమీక్ష

ధరలు తగ్గిన తర్వాత దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 1757.50కి దిగివచ్చింది. అయితే, 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ ధరలు తగ్గించినప్పటికీ డొమెస్టిక్ (గృహ వినియోగ సిలిండర్) ఎల్‌పీజీ సిలిండర్ ధరల తగ్గింపులో ఎలాంటి మార్పు లేదని ప్రకటించాయి. సాధారణంగా కమర్షియల్, డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలకు సంబంధించి ప్రతి నెల మొదటి రోజున చమురు సంస్థలు సమీక్షిస్తాయి. 19 కిలోల LPG సిలిండర్ ధరలు.. దిల్లీలో 19కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1757.50కి దిగివచ్చింది. కోల్‌కతాలో రూ. 1868. 50కి తగ్గింది. ముంబైలో రూ.1710కి దిగింది. చెన్నైలో రూ. 1929 వద్దే ఉంది. హైదరాబాద్‌లో 2002 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

DETAILS

దక్షిణ భారతంలోనూ తగ్గని ధరలు

దక్షిణ భారత్లోదేశంలో కమర్షియల్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వాణిజ్య LPG సిలిండర్‌ల ధరల తగ్గింపు, వ్యాపారాలు, కమర్షియల్‌ వినియోగదారులకు సానుకూల పరిణామం. గృహ వినియోగ సిలిండర్ ధరలిలా.. డొమెస్టిక్ LPG సిలిండర్ల కోటాలో ఈఏడాది ఆగస్ట్ నుంచి గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చివరి సారిగా ఆగస్టు30న కేంద్రం రూ. 200 మేర తగ్గించింది. ప్రస్తుతం డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు దిల్లీలో రూ. 903గా ఉన్నాయి. కోల్‌కతాలో రూ. 929, ముంబైలో రూ. 902.50గా ఉంది.హైదరాబాద్'లో 14. 2 కేజీల సిలిండర్ రేటు రూ. 955 గా ఉంది. ఇక ఉజ్వల లబ్ధిదారులకు ప్రభుత్వం సిలిండర్'పై రూ. 300 సబ్సిడీ అందించం కొసమెరుపు.