
Microsoft: వచ్చే ఏడాది నుంచి వారంలో మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులతో మైక్రోసాఫ్ట్
ఈ వార్తాకథనం ఏంటి
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలుకుతూ ఐటీ కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే పనిలో పడ్డాయి. తాజాగా అందులో, టెక్నాలజీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. వచ్చే ఏడాది నుండి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని మైక్రోసాఫ్ట్ వారి అధికారిక బ్లాగ్‌లో వెల్లడించింది.
వివరాలు
2026 ఫిబ్రవరి చివరి నుండి వర్తింపు
ఈ విధానాన్ని మూడు దశలలో అమలు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్‌మాన్ బ్లాగ్‌లో పేర్కొన్నారు. మొదట వాషింగ్టన్, రెడ్‌మండ్‌లోని ప్రధాన కార్యాలయంలో ఈ విధానం ప్రారంభమవుతుందని, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర కార్యాలయాల్లో కూడా అదే విధంగా అమలు కానుందని చెప్పారు. కంపెనీ ప్రధాన కార్యాలయం నుంచి 50 మైళ్ల లోపలి ప్రాంతాల్లో నివసిస్తున్న ఉద్యోగులపై ఈ విధానం 2026 ఫిబ్రవరి చివరి నుండి వర్తించనుంది. మిగిలిన అమెరికా ప్రాంతాల్లోని ఉద్యోగుల కోసం కార్యాలయాలకు వచ్చే విషయానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది
వివరాలు
కరోనా మహమ్మారి సమయంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి
కరోనా మహమ్మారి సమయంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి నుంచి దాదాపు అన్ని కంపెనీలు బయటకు వస్తున్నాయి. ఎక్కువ కంపెనీలు మళ్లీ ఉద్యోగులను ఆఫీసుల వద్ద పనికి తీసుకెళ్ళే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో హెచ్‌సీఎల్, అమెజాన్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను ఆఫీసులో వచ్చి పని చేయాలని ప్రోత్సహిస్తున్నాయి.