
Noida: అంబానీ కంటే ధనికుడు..! నోయిడా యువకుడి అకౌంట్‌లో రూ.10 సెప్టిలియన్‌కు పైగా జమ.. అసలేం జరిగిందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 20 ఏళ్ల యువకుడు దీపక్ ఒక్కసారిగా తన ఖాతాలో ఏకంగా రూ. 10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299 జమైందని చూసి షాక్‌కి గురయ్యాడు. ఇది అక్షరాలా రూ. 1 అండెసిలియన్ అంటే 1 సెప్టిలియన్ ట్రిలియన్ కు పైగా ఉండొచ్చని అంచనా. ఈ ఖాతా కోటక్ మహీంద్రా బ్యాంకులోని ఆయన మరణించిన తల్లి గాయత్రి దేవి పేరిట ఉంది. ఆమె రెండు నెలల క్రితమే కన్నుమూశారు. ఆ అకౌంట్‌ను కొనసాగిస్తూనే ఉన్న దీపక్‌కి ఆగస్టు 3న రాత్రి అకౌంట్‌లో రూ. 1.13 లక్షల కోట్ల (₹1,13,56,000 కోట్ల) క్రెడిట్ మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసిన దీపక్‌కి మొదట నమ్మకం కలగలేదు. వెంటనే తన ఫ్రెండ్స్‌కు చూపించి "జీరోలు లెక్కపెట్టు చూడు" అన్నాడు!
వివరాలు
నాకు మ్యాథ్స్ బాగా రాదు.. మీరే లెక్కించండి
ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జర్నలిస్ట్ సచిన్ గుప్తా ఈ వార్తను ట్వీట్ చేస్తూ, ''నాకు మ్యాథ్స్ బాగా రాదు.. మీరే లెక్కించండి. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు చేస్తోంది. అకౌంట్ ఫ్రీజ్ చేశారు'' అని పేర్కొన్నారు. దీంతో షాక్‌కి గురైన దీపక్ మరుసటి రోజు బ్యాంక్‌కు వెళ్లి ఖాతాలో ఉన్న అమౌంట్‌ను కన్ఫర్మ్ చేసుకున్నాడు. బ్యాంక్ సిబ్బంది కూడా ఈ పెద్ద మొత్తం చూసి ఖంగారు పడ్డారు. దీంతో అప్రమత్తమైన బ్యాంక్ అధికారులు వెంటనే ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖకు సమాచారం ఇచ్చారు. అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సచిన్ గుప్తా చేసిన ట్వీట్
नोएडा में 20 साल के दीपक के कोटक महिंद्रा बैंक खाते में 36 डिजिट की धनराशि आई है।
— Sachin Gupta (@SachinGuptaUP) August 4, 2025
ये रकम 1 अरब 13 लाख 56 हजार करोड़ रुपए बैठती है।
मेरा गणित थोड़ा कमजोर है। बाकी आप लोग गुणा-भाग कर सकते हैं।
फिलहाल इनकम टैक्स विभाग जांच कर रहा है। बैंक खाता फ्रीज कर दिया गया है। pic.twitter.com/cLnZdMKozD
వివరాలు
అంబానీ కంటే ధనికుడు
ఇదే సమయంలో దీపక్‌కి బంధువులు, ఫ్రెండ్స్, పొరుగువారు నుంచి ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. హఠాత్తుగా వచ్చిన పాపులారిటీను తట్టుకోలేకపోయిన యువకుడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పుడు అధికారులు దీన్ని టెక్నికల్ లోపమా? బ్యాంక్ లోపమా? లేదా మనీలాండరింగ్ కేసా? అనే కోణాల్లో విచారిస్తున్నారు. అసలు ఈ మొత్తానికి మూలం ఏమిటన్నది పూర్తిగా దర్యాప్తు అనంతరం తెలియనుంది. ఈ సంఘటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ''ఇది బ్యాంక్ సాఫ్ట్‌వేర్ లోపం లేకపోతే, మాన్యువల్ ఎంట్రీలో ఎక్కడో తప్పిదం కావచ్చు'' అని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు సరదాగా.. ''ఇప్పుడిప్పుడే ఈ యువకుడు అంబానీ కంటే ధనికుడు అయిపోయాడు'' అని సెటైర్లు వేస్తున్నారు.
వివరాలు
₹1001356000000000000100235600000000299
ఒక వ్యక్తి ఈ మొత్తాన్ని లెక్కపెడుతూ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి: ''వంద క్వింటిలియన్, వంద ముప్పై ఐదు క్వాడ్రిలియన్, ఆరు వంద ట్రిలియన్, పది మిలియన్, ఇరవై మూడు వేల అయిదు వంద అరవై, రెండు వందల తొంభై తొమ్మిది''. ఈ ఘటన సోషల్ మీడియాలో జోరుగా చర్చకు దారితీయగా, దీని వెనక ఉన్న అసలైన నిజం ఏంటన్నదీ ఇంకా తేలాల్సి ఉంది.
వివరణ
ఘటనపై స్పందించిన కొటక్ మహీంద్రా బ్యాంక్..
ఒక ఖాతాదారుని ఖాతాలో అసాధారణంగా పెద్ద మొత్తంలో డబ్బు ఉందంటూ కొన్ని మీడియాలో వస్తున్న వార్తలపై కొటక్ మహీంద్రా బ్యాంక్ (KMBL) స్పష్టత ఇచ్చింది. బ్యాంక్ తెలిపిన ప్రకారం, "ఒక ఖాతాలో భారీ మొత్తంలో బ్యాలెన్స్ ఉందని కొన్ని మీడియా నివేదికలు చెబుతున్నాయి. కానీ అవి పూర్తిగా అవాస్తవం.కస్టమర్లకు ఖాతా వివరాల్ని చెక్ చేయడానికి కొటక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగించాలని బ్యాంకు అధికారులు విజ్ఞప్తి చేశారు. బ్యాంక్ సిస్టమ్‌లు అన్ని సజావుగానే పనిచేస్తున్నాయని.. మా సేవలు పూర్తిగా భద్రమైనవేనని , ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదని కొటక్ మహీంద్రా బ్యాంక్ స్పష్టం చేసింది. ధ్రువీకరించని సమాచారంపై ఆధారపడవద్దని వినియోగదారులకు బ్యాంకు సూచించింది.