Page Loader
SEBI Chief: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు
సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు

SEBI Chief: సెబీ చీఫ్‌పై మరోసారి కాంగ్రెస్‌ పార్టీ ఆరోపణలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2024
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెబీ చైర్‌పర్సన్‌ మాధబి పురి బచ్‌పై కాంగ్రెస్‌ పార్టీ నేత పవన్‌ ఖేరా మళ్లీ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో చేసిన ఆరోపణలకు సమాధానంగా ఆమె, ఆమె భర్త గతంలో వివరణ ఇచ్చారు. అయితే ఈసారి ఖేరా కొత్త ఆరోపణలు చేశారు. 2017 నుంచి 2023 మధ్య సెబీ చైర్‌పర్సన్‌ పదవిలో ఉన్నప్పుడే బచ్‌ రూ. 36.9 కోట్ల విలువైన లిస్టెడ్‌ సెక్యూరిటీల్లో ట్రేడింగ్‌ చేసినట్లు తెలిపారు. అయితే 2018-19లో పెద్ద మొత్తంలో ట్రేడింగ్‌ జరిపారని పేర్కొన్నారు. పవన్‌ ఖేరా సెబీ చీఫ్‌పై విదేశీ ఫండ్స్‌లో పెట్టుబడుల విషయాన్ని కూడా లేవనెత్తారు.

Details

మాధబి పురి బచ్‌ ఆరోపణలను తోసిపుచ్చిన కాంగ్రెస్

బచ్‌ విదేశీ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టారని, అందులో చైనాకు చెందిన గ్లోబల్‌ X MSCI చైనా కన్జూమర్‌, ఇన్వెస్కో చైనా టెక్నాలజీ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు ఉన్నట్లు ఆరోపించారు. బచ్‌ ఈ పెట్టుబడుల గురించి ఎప్పుడు ప్రకటించారు? ఈ విషయాలను ప్రభుత్వ ఏజెన్సీలకు తెలియజేశారా? అని ప్రశ్నించారు. సెబీ చీఫ్‌ మాధబి పురి బచ్‌ ఇటీవల ఇచ్చిన వివరణను కాంగ్రెస్‌ తోసిపుచ్చింది. ముఖ్యంగా ఐసీఐసీఐ మహీంద్రా గ్రూప్‌ సంస్థల విషయంలో ఆమె వివరణ సరిపోదని ఖేరా అన్నారు.

Details

హాట్ టాపిక్ గా మారిన సెబీ ఆరోపణలు

మరోవైపు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఈ ఆరోపణలపై ప్రధాని మోదీని ప్రశ్నించారు. సెబీ చీఫ్‌పై వస్తున్న ఆరోపణల గురించి ప్రధానికి తెలుసా? చైనా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన విషయం ప్రధానికి తెలుసా? అని నిలదీశారు. సెబీ చైర్‌పర్సన్‌పై కాంగ్రెస్‌ ఆరోపణలు, బీజేపీపై విమర్శలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.