
Pakistan: భారత్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. కుప్పకూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్..
ఈ వార్తాకథనం ఏంటి
భారత్, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠ భరిత పరిణామాలు,ఆపరేషన్ సిందూర్, భారత్ తీసుకున్న వాణిజ్య నిషేధ నిర్ణయాలు కలిపి పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
భారత్ మెరుపుదాడులు ఉగ్రవాద స్థావరాలపై నిర్వహించిన అనంతరం కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ ఘోరంగా కుప్పకూలింది.
పాకిస్తాన్ కీలక బెంచ్‌మార్క్ సూచీ అయిన KSE-30 సూచీ ఒక్కసారిగా 7,200 పాయింట్లు క్షీణించింది.
ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.
వరుసగా రెండో సెషన్‌లో కూడా భారీ నష్టాలు నమోదయ్యాయి. గురువారం ఉదయం కరాచీ, లాహోర్‌తో పాటు పలు పట్టణాల్లో జరిగిన పేలుళ్ల తర్వాత మార్కెట్ క్షీణత ప్రారంభమైంది.
వివరాలు
మూడీస్ నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారుతుందని
ఇక KSE-100 సూచీ కూడా 5 శాతం మేరకు పడిపోయింది,అంటే దాదాపు 6,000 పాయింట్లు క్షీణించింది.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) రేపు ప్రకటించబోయే ఆర్థిక సహాయ ప్యాకేజీపై ఆధారపడి ఉంది.
ఐఎంఎఫ్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందన్నది అక్కడి మార్కెట్లలో ఆసక్తికర చర్చగా మారింది.
అంతేకాకుండా నిన్నటి సెషన్‌లోనూ పాక్ స్టాక్ మార్కెట్ 3 శాతం కంటే ఎక్కువ మేర నష్టాన్ని చవిచూసింది.
మూడీస్ వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం, భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మరింత దిగజారుస్తుందని అంచనా వేసింది.