Paytm Acquisition:పేటియం కొత్త డీల్.. బెంగళూరు ఆధారిత స్టార్టప్ కొనుగోలుకు యత్నం
రెగ్యులేటరీ సంక్షోభం కారణంగా పేటియం చెల్లింపుల వ్యాపారం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నతరుణంలో,ఫిన్‌టెక్ మేజర్ ఇంటర్‌ఆపరబుల్ ఈ-కామర్స్ స్టార్టప్ అయిన Bitsilaను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన బిట్‌సిలా ప్రస్తుతం ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC)లో లావాదేవీల ద్వారా మూడవ అతిపెద్ద కంపెనీ. ఈ ఒప్పందంకు తుది టచ్ ఇస్తున్నట్లు చెప్పబడింది.వచ్చే వారంలో డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది. బిట్‌సిలా వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2020లో దశరథం బిట్ల, సూర్య పొక్కలి స్థాపించిన బిట్‌సిలా స్టార్టప్‌ను ప్రారంభించారు. గతంలో ఆంట్లెర్ ఇండియా, రెడ్‌బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర సామా నుండి ప్రీ-సీడ్ రౌండ్‌లో నిధులను సేకరించింది.
ONDCలో అందుబాటులో ఉన్న పేటియం
సెల్లర్ సైడ్ యాప్‌గా ONDCలో కంపెనీ పాత్ర B2B,ఎందుకంటే ఇది నెట్‌వర్క్‌లో చిన్న వ్యాపారులను ఆన్‌బోర్డ్ చేయడంలో సహాయపడుతుంది. Paytm 2022 నుండి ONDCలో యాక్టివ్‌గా ఉంది.ప్రభుత్వ ఈ -కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో దాని యాప్‌ను ఇంటిగ్రేట్ చేసిన మొదటి పెద్ద కంపెనీలలో ఒకటి. ప్రస్తుతం,పేటియం సేవలు కొనుగోలుదారు యాప్ రూపంలో ONDCలో అందుబాటులో ఉన్నాయి. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి Paytm ఒక్కొక్కషేర్ రూ. 447 వద్ద ట్రేడవుతోంది.దింతో paytm షేర్లు 10 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. 2025 చివరి నాటికి Paytm దాని 10 మిలియన్ల వ్యాపారులను ONDCకి చేర్చుతుందని ఫిన్‌టెక్ యునికార్న్ వ్యవస్థాపకుడు,చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయ్ శేఖర్ శర్మ డిసెంబర్ 4న తెలిపారు.