Paytm: ఏఐ స్టార్టప్ కంపెనీ పర్‌ప్లెక్సిటీతో పేటీఎం భాగస్వామ్యం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటియం (Paytm) మాతృసంస్థ 'వన్97 కమ్యూనికేషన్స్'.. ఏఐ స్టార్టప్ పర్‌ప్లెక్సిటీతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంది.
తన యాప్‌లో కృత్రిమ మేధా ఆధారిత సెర్చింగ్ సేవలను అందించేందుకు ఈ స్టార్టప్‌తో కలిసి పనిచేస్తున్నట్లు గురువారం ప్రకటించింది.
ఆర్థిక అక్షరాస్యతను పెంచేందుకు ఈ సేవలు ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొంది.
ఈ సౌకర్యం ద్వారా వినియోగదారులు తమ స్థానిక భాషల్లో ప్రశ్నలు వేసి సమాధానాలు పొందగలరని వెల్లడించింది.
వివరాలు
సమాచారాన్ని పొందడం,సరికొత్త నిర్ణయాలు తీసుకోవడంలో కృత్రిమ మేధా కీలక పాత్ర
ఈ భాగస్వామ్యంపై పేటీఎం వ్యవస్థాపకుడు,సీఈఓ విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ,''త్వరగా సమాచారాన్ని పొందడం,సరికొత్త నిర్ణయాలు తీసుకోవడంలో కృత్రిమ మేధా కీలక పాత్ర పోషిస్తోంది. పర్‌ప్లెక్సిటీ సహాయంతో మేము లక్షలాదిమంది వినియోగదారులకు ఏఐ శక్తిని అందిస్తున్నాం,ఇది ఆర్థిక సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేలా సహాయపడుతుంది.'' అని తెలిపారు.
పేటీఎంతో భాగస్వామ్యంపై పర్‌ప్లెక్సిటీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అరవింద్ శ్రీనివాస్ సంతోషం వ్యక్తంచేశారు.
వినియోగదారులు మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేలా ఈ ఏఐ సేవలు సహాయపడతాయని పేర్కొన్నారు.