Stock market: బడ్జెట్ రోజున ఇన్వెస్టర్లకు లాభామా.. నష్టమా? .. గత పదేళ్లు ఎలా ఉన్నాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
స్టాక్ మార్కెట్ సాధారణంగా సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐదు రోజులపాటు ట్రేడింగ్ కొనసాగుతుంది. అయితే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున మార్కెట్లు తెరుచుకోనున్నాయి.
బడ్జెట్ నేపథ్యంలో మార్కెట్లకు సెలవు ఉండదని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పటికే స్పష్టం చేసింది.
గత 10 ఏళ్లలో బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ల ప్రభావాన్ని పరిశీలించినట్లయితే, మార్కెట్లపై మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి.
Details
స్టాక్ మార్కెట్ బడ్జెట్ డే ప్రతిస్పందన
బడ్జెట్ రోజున మార్కెట్లకు ఎప్పుడూ అధిక అంచనాలు ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వం కీలక విధానపర నిర్ణయాలు, రంగాల వారీగా కేటాయింపులు ప్రకటించడంతో మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు చోటు చేసుకుంటాయి.
గత 20 బడ్జెట్లను పరిశీలిస్తే, మార్కెట్లు సగం సార్లు నష్టపోగా, సగం సార్లు లాభాలు నమోదు చేశాయి.
2014 నుండి 2024 వరకు మార్కెట్లు ఎలా స్పందించాయో పరిశీలిద్దాం.
Details
గత పదేళ్ల ప్రభావం
2024 (జూలై 23) మధ్యంతర బడ్జెట్ సమయంలో సెన్సెక్స్ 70 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు పడిపోయాయి.
2024 (ఫిబ్రవరి) ఓటాన్ బడ్జెట్ సందర్భంగా సెన్సెక్స్ 106.81 పాయింట్లు, నిఫ్టీ 28.25 పాయింట్లు (0.13%) తగ్గాయి.
2023 (ఫిబ్రవరి) సెన్సెక్స్ 158 పాయింట్లు పెరిగినా నిఫ్టీ 46 పాయింట్లు పడిపోయింది. ఒక దశలో సెన్సెక్స్ 1100 పాయింట్లు పెరిగి, తిరిగి తగ్గడం గమనార్హం.
2022 బడ్జెట్ సమయంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 849 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 1.4% పెరిగింది.
2021 కరోనా వేళ ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్లకు పెద్ద లాభాలను ఇచ్చింది. సెన్సెక్స్ 2314 పాయింట్లు, నిఫ్టీ 4.7% పెరిగింది.
Details
2019లో 8శాతం పడిపోయింది
2020 నిఫ్టీ 2.50% పడిపోయింది. కరోనా ప్రభావంతో అమ్మకాల ఒత్తిడి పెరిగింది.
2019 NDA ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ సందర్భంగా నిఫ్టీ 1% క్షీణించగా, నెల రోజుల వ్యవధిలో 8% పడిపోయింది.
2018 బడ్జెట్ రోజు నిఫ్టీ స్వల్పంగా 0.20% తగ్గి, నెలలో 6% పడిపోయింది. జీఎస్టీ అమలుకు తర్వాత ఇదే తొలి బడ్జెట్ కావడం విశేషం.
2017 NDA ప్రభుత్వం ఫిబ్రవరి 28 నుంచి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1కి మార్చింది. రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌లో కలిపింది. సెన్సెక్స్ 486 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 1.8% లాభపడింది.
Details
2015లో లాభాలు
2016 అరుణ్ జైట్లీ మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టగా, సెన్సెక్స్ 152 పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్లు తగ్గాయి. కానీ నెలలో 10% పెరిగింది.
2015 ఫిబ్రవరి బడ్జెట్ రోజున సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాలు నమోదయ్యాయి.
2014 ఎన్నికల సంవత్సరం కావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టగా, సెన్సెక్స్ 97, నిఫ్టీ 25 పాయింట్లు పెరిగాయి. NDA అధికారంలోకి వచ్చాక మధ్యంతర బడ్జెట్‌లో (జులై) సెన్సెక్స్ 70, నిఫ్టీ 17 పాయింట్లు తగ్గాయి.
Details
ఈసారి మార్కెట్లపై బడ్జెట్ ప్రభావం?
ఈసారి కూడా మార్కెట్లు బడ్జెట్‌పై మిశ్రమంగా స్పందించే అవకాశం ఉంది.
ప్రధానంగా ప్రభుత్వ ఖర్చులు, ఆర్థిక లోటు, కొత్త పథకాలు, పెట్టుబడిదారుల ఊహాగానాలు మార్కెట్ల కదలికలను ప్రభావితం చేయనున్నాయి.
బడ్జెట్ రోజు మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండడం మంచిది.