LOADING...
Quick commerce: దీపావళికి 100 కోటి ఆర్డర్ల మైలురాయి దాటనున్న క్విక్ కామర్స్‌
దీపావళికి 100 కోటి ఆర్డర్ల మైలురాయి దాటనున్న క్విక్ కామర్స్‌

Quick commerce: దీపావళికి 100 కోటి ఆర్డర్ల మైలురాయి దాటనున్న క్విక్ కామర్స్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2025
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పుడు ఇంకా ప్రారంభ దశలో ఉన్న క్విక్ కామర్స్‌ రంగం ఈ సంవత్సరం దీపావళికి ఒక బిలియన్ (100 కోటి) వార్షిక ఆర్డర్లను అధిగమించే అవకాశం ఉంది. పరిశ్రమలో పనిచేసే వర్గాలు, ముఖ్యంగా ఈ రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఐదు కంపెనీలు - బ్లింకిట్, స్విగ్గీ,ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్.. ఈ మైలురాయికి ముఖ్య పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీల వృద్ధి అద్భుతంగా ఉంది. ఉదాహరణకు, బ్లింకిట్ రోజుకు 21 లక్షల ఆర్డర్లు డెలివరీ చేస్తుంది, ఇన్‌స్టామార్ట్ 10.5 లక్షలు, జెప్టో 15 లక్షల డెలివరీలతో క్లోజ్ గా ఫాలో అవుతోంది.

మార్కెట్ విస్తరణ 

ఇతర కంపెనీలు, కొత్తవారి ప్రవేశం

బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ వంటి ఇతర కంపెనీలు కూడా ఆర్డర్ వాల్యూమ్ పెరగడంలో సహాయపడుతున్నాయి. బిగ్‌బాస్కెట్ రోజుకు 5 లక్షలకి పైగా ఆర్డర్లు పూర్తి చేస్తోంది, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ రోజుకు 3 లక్షల డెలివరీలు అందిస్తోంది. ఇక అమెజాన్ నౌ, ఫస్ట్‌క్లబ్ వంటి కొత్త కంపెనీలు క్విక్ కామర్స్ రంగంలోకి చేరడం ద్వారా ఈ సంఖ్యలు ఇంకా పెరుగుతాయి, పరిశ్రమ వేగవంతమైన వృద్ధిని చూపుతోంది.

పరిశ్రమ వృద్ధి 

కోట్లల్లో బ్లింకిట్,ఇన్‌స్టామార్ట్ వినియోగదారులు 

క్విక్ కామర్స్‌ పరిశ్రమ ఏడాదికి 100% పైగా వృద్ధి సాధించింది. ఇది నగరాలు,కేటగిరీల విస్తరణ వల్ల సాధ్యమైంది. బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి కంపెనీల నెలవారీ వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నదీ దీనికి గుర్తుగా ఉంది. బ్లింకిట్ నెలవారీ యాక్టివ్ కస్టమర్‌లు FY25 Q1లో 76 లక్షలుండగా, FY26 Q1లో 1.69 కోట్లు చేరగా, ఇన్‌స్టామార్ట్ వినియోగదారులు 52 లక్షల నుంచి 1.11 కోట్లు అయ్యాయి.

వినియోగదారుల పోకడలు 

వినియోగదారుల ప్రవర్తనలో మార్పు వృద్ధికి దారి

సాంప్రదాయ ఇ-కామర్స్,ఆఫ్‌లైన్ స్టోర్ల నుండి వినియోగదారులు క్విక్ కామర్స్‌ వైపు మారడం పరిశ్రమ వృద్ధికి దోహదపడింది. "వినియోగదారులు తాము సాధారణంగా కొనుగోలు చేసేవి 15-20% వరకు క్విక్ కామర్స్‌లోకి మార్చారు. దీని వల్ల పరిశ్రమ వృద్ధి మరింత వేగంగా పెరిగింది," అని డాటమ్ ఇన్టెలిజెన్స్ సలహాదారు సతీష్ మీనా పేర్కొన్నారు. ఇక కొనుగోలు తీరు కూడా ముందటి తరహా తక్షణపు టాప్-అప్‌లను మించిన, ప్రణాళికాబద్ధంగా మారింది.

రెగ్యులేటరీ పరిశీలన 

CCI క్విక్ కామర్స్ కంపెనీలపై పరిశీలన

క్విక్ కామర్స్ రంగం వేగంగా వృద్ధి చెందడం భారత పోటీ కమిషన్ (CCI) దృష్టిని ఆకర్షించింది. ఈ సంస్థ, కంపెనీల ఆంతరంగిక పోటీ వ్యతిరేక చర్యలు, FDI నిబంధనల ఉల్లంఘనలు, ధర విధానాలు వంటి అంశాలను పరిశీలిస్తోంది. పరిశ్రమ 2020లో అతి తక్కువ మార్కెట్‌ నుంచి ఐదు సంవత్సరాల్లో 7.5 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా మారింది.