NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / SBI Branches: మరో 500ఎస్‌బిఐ శాఖలు ప్రారంభం..మొత్తం నెట్‌వర్క్‌ను 23,000కి: నిర్మలా సీతారామన్‌ 
    తదుపరి వార్తా కథనం
    SBI Branches: మరో 500ఎస్‌బిఐ శాఖలు ప్రారంభం..మొత్తం నెట్‌వర్క్‌ను 23,000కి: నిర్మలా సీతారామన్‌ 
    మరో 500ఎస్‌బిఐ శాఖలు ప్రారంభం

    SBI Branches: మరో 500ఎస్‌బిఐ శాఖలు ప్రారంభం..మొత్తం నెట్‌వర్క్‌ను 23,000కి: నిర్మలా సీతారామన్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 18, 2024
    04:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మరింత విస్తరణకు సిద్ధమైందని వెల్లడించారు.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి దేశవ్యాప్తంగా మరో 500 కొత్త బ్రాంచీలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

    ఈ విస్తరణతో ఎస్‌బీఐ బ్రాంచీల సంఖ్య 23,000కు చేరుకోనుంది.

    ముంబైలో ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం 100వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

    1921లో బ్యాంకు ప్రయాణం ఎలా మొదలైందో గుర్తుచేసుకున్నారు.

    వివరాలు 

    1955లో పార్లమెంట్ చట్టం ద్వారా బ్యాంకు పేరు 

    ''1921లో మూడు ప్రెసిడెన్సీ బ్యాంకులను విలీనం చేసి **ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IBI)**గా ఏర్పాటు చేశారు. 1955లో పార్లమెంట్ చట్టం ద్వారా దీనిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ప్రారంభ దశలో 250 బ్రాంచీలతో ఉన్న ఎస్‌బీఐ, ఇప్పుడు 22,500 బ్రాంచీలతో దేశవ్యాప్తంగా విస్తరించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి ఈ సంఖ్య 23,000ను చేరుకోనుంది'' అని ఆమె వివరించారు.

    వివరాలు 

    రూ.100 స్మారక నాణెం విడుదల

    ప్రస్తుతం ఎస్‌బీఐకు 50 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారని, దేశంలోని మొత్తం డిపాజిట్లలో బ్యాంకు వాటా 22.4 శాతం అని పేర్కొన్నారు.

    డిజిటల్ పెట్టుబడుల్లో బ్యాంకు వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రోజుకు 20 కోట్ల యూపీఐ లావాదేవీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

    ఈ సందర్భంగా ముంబై బ్రాంచీ శతాబ్దోత్సవాన్ని పురస్కరించుకుని రూ.100 స్మారక నాణెం విడుదల చేశారు.

    దేశవ్యాప్తంగా 43 ఎస్‌బీఐ బ్రాంచీలు శతాబ్దం చరిత్ర కలిగినవిగా గుర్తింపు పొందాయని ఆమె చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిర్మలా సీతారామన్
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

    తాజా

    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్
    Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం జీవనశైలి
    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్

    నిర్మలా సీతారామన్

    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    'వంటగ్యాస్ ధరను తగ్గించాలి'; ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ ఆర్థిక శాఖ మంత్రి
    20% వృద్ధి చెంది, ₹20 లక్షల కోట్ల మార్కుకు చేరుకున్న ఆదాయపు పన్ను వసూళ్లు ఆర్ధిక వ్యవస్థ
    భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

    అన్ని బ్యాంకుల ఖాతాదారులకు ఎస్‌బీఐ గుడ్ న్యూస్..కార్డు లేకున్నా నగదు డ్రా చేసుకోవచ్చు బిజినెస్
    ఎస్‌బీఐ చైర్మన్ జీతం తెలిస్తే షాక్.. వెల్లడించిన మాజీ సారథి రజనీష్ కుమార్ బ్యాంక్
    ఎస్​బీఐతో జట్టు కట్టిన రిలయెన్స్.. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు రిలయెన్స్
    SBI MCap: ఒక్కరోజే 10% పెరిగిన ఎస్‌బీఐ షేరు.. ఏకంగా రూ.8 లక్షల కోట్ల మార్కుతో ఘనత!  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025