Page Loader
Stock market: రాణించిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@ 23,300  
రాణించిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@ 23,300

Stock market: రాణించిన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు .. నిఫ్టీ@ 23,300  

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 02, 2025
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్‌ స్టాక్స్‌ కొనుగోళ్ల మద్దతుతో సూచీలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌తో పాటు మరికొన్ని దేశాలపై సుంకాలను ప్రకటించనుండగా, ఈ తరుణంలో మన మార్కెట్‌ సూచీలు బలంగా ముగియడం విశేషం. సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా పెరిగి, నిఫ్టీ 23,300 పైన ముగిసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 1.30 గంటలకు ట్రంప్‌ తన నిర్ణయాన్ని వెల్లడించనుండగా, వెంటనే సుంకాలు అమల్లోకి వస్తాయని శ్వేతసౌధం ప్రకటించింది.

వివరాలు 

డాలరుతో రూపాయి మారకం విలువ 85.51

సెన్సెక్స్‌ 76,146.28 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 76,024.51) లాభాలతో ప్రారంభమైంది. ప్రారంభంలో కొంత మిశ్రమ ధోరణి కనబరిచినప్పటికీ, చివర్లో కొనుగోళ్ల మద్దతుతో మంచి లాభాలు నమోదయ్యాయి. ఇంట్రాడేలో 76,064.94- 76,680.35 పాయింట్ల మధ్య కదలాడిన సూచీ, చివరికి 592.93 పాయింట్ల లాభంతో 76,617.44 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 166.65 పాయింట్లు పెరిగి 23,332.35 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.51గా ఉంది.

వివరాలు 

అంతర్జాతీయంగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 74.21 డాలర్లు

సెన్సెక్స్‌ 30 సూచీలో జొమాటో, టైటాన్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, టెక్‌ మహీంద్రా షేర్లు ముఖ్యంగా బలంగా రాణించాయి. నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయంగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 74.21 డాలర్లుగా ఉండగా, బంగారం ఔన్సు 3163 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.