Stock Market : ట్రంప్ షాక్‌తో ₹6 లక్షలు కోట్లు ఆవిరి.. నాలుగో రోజూ నష్టాల్లో సూచీలు..
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల కారణంగా వరుసగా నాలుగు రోజులుగా మార్కెట్లు నష్టపోతూనే ఉన్నాయి.
స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 700 పాయింట్ల మేర నష్టపోగా, నిఫ్టీ 23,400 దిగువకు పడిపోయింది.
బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.6 లక్షల కోట్లు తగ్గి, రూ.418 లక్షల కోట్లకు చేరుకుంది.
సెన్సెక్స్ ఉదయం 77,789.30 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 77,860.19) నష్టాల్లో ప్రారంభమై, రోజంతా నష్టాలను ఎదుర్కొంది.
వివరాలు
రూపాయి మారకం విలువ 87.49
ఇంట్రాడేలో 77,106.89 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 548.39 పాయింట్ల నష్టంతో 77,311.80 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 178.35 పాయింట్ల నష్టంతో 23,381.60 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ డాలరుతో పోల్చితే ఒక పైసా మేర బలపడి 87.49 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 సూచీలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, టాటా స్టీల్, జొమాటో, టైటాన్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75.36 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ధర పెరుగుతోంది. ఔన్సు బంగారం 2,929.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
నష్టాలకు ప్రధాన కారణాలు:
అమెరికా దిగుమతులపై సుంకాలు:
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్టీల్,అల్యూమినియం దిగుమతులపై 25%సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. అయితే, ఏ దేశాలపై ఎప్పుడు అమలు చేయనున్నారనే వివరాలు వెల్లడించకపోయినా,ఈ ప్రకటన మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.
వాణిజ్య యుద్ధ భయాలు:ట్రంప్ ప్రకటనతో పాటు,తమపై సుంకాలు విధించిన దేశాలపై తాము కూడా సుంకాలు విధిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు మార్కెట్ నష్టాలకు దారితీశాయి.
విదేశీ మదుపర్ల అమ్మకాలు:దేశీయ మార్కెట్‌లో విదేశీ మదుపర్లు భారీగా అమ్మకాలు నిర్వహిస్తున్నారు.
డాలర్ బలపడటం:అమెరికా డాలర్ బలపడడంతో పాటు,అక్కడి 10 ఏళ్ల బాండ్ల రాబడి 4.4% పైకి చేరుకోవడంతో మార్కెట్ దృష్టిని ఆకర్షించింది.
కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు:దేశీయంగా కొన్ని కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, మార్కెట్ కరెక్షన్‌కు దారితీసింది.