
Stock market: లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @25500
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. ఉదయం దాదాపు మార్పులేకుండా (ఫ్లాట్‌గా) ప్రారంభమైన మార్కెట్ చివర్లో కొనుగోళ్లకు మద్దతు లభించడంతో లాభాలను నమోదు చేసింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్ల ఒత్తిడి మార్కెట్‌కు బలాన్నిచ్చింది. ఇక మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్‌ల (ఆంక్షల) అంశంపై ఇంకా స్పష్టత లేకపోవడం మార్కెట్‌ను కొంతవరకూ ప్రభావితం చేసింది. ఇప్పటికే అమెరికా కొన్ని దేశాలపై దిగుమతి సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీనివల్ల భారత్ - అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి నెలకొంది. ఫలితంగా మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
వివరాలు
చివరి అరగంటలో కొనుగోళ్ల ఊపుతో సూచీలో లాభాలు నమోదు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాల మధ్య, బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం 83,387.03 వద్ద ప్రారంభమైంది (గత ముగింపు స్థాయి 83,442.50). ట్రేడింగ్ సమయంలో ఫ్లాట్‌గా కొనసాగిన సూచీ,ఇంట్రాడేలో కనిష్ఠంగా 83,320.95ని తాకింది. అయితే చివరి అరగంటలో కొనుగోళ్ల ఊపుతో సూచీలో లాభాలు నమోదయ్యాయి. చివరకు సెన్సెక్స్ 270.01 పాయింట్ల లాభంతో 83,712.51 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 61.20 పాయింట్లు లాభపడి 25,222.50 వద్ద స్థిరపడింది.
వివరాలు
రూపాయి మారక విలువ డాలరుతో పోలిస్తే 85.71
రూపాయి మారక విలువ డాలరుతో పోలిస్తే 85.71గా ఉంది. సెన్సెక్స్-30లో భాగమైన కంపెనీల్లో కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, బీఈఎల్ షేర్లు మంచి లాభాలను నమోదు చేశాయి. అయితే టైటాన్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 69.37 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో బంగారం ఔన్సుకు 3,333 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.