Page Loader
Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం
స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం

Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

వచ్చే వారంలో స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ల సందడి కొనసాగనుంది. మార్కెట్‌ ద్వారా నిధులు సమీకరించిన దశకు చేరుకున్న దాదాపు 10 కంపెనీలు, వచ్చే వారం దలాల్‌ స్ట్రీట్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. జూన్‌ మొదటి వారంలో ఐపీఓ ఫ్రంట్‌లో కేవలం ఒక్క కంపెనీ మాత్రమే ముందుకొస్తుండగా, మిగిలిన సంస్థలు లిస్టింగ్‌కు సిద్ధమవుతున్నాయి.

Details

 గంగా బాత్‌ ఫిట్టింగ్‌ ఐపీఓ

ఎస్‌ఎంఈ విభాగానికి చెందిన గంగా బాత్‌ ఫిట్టింగ్‌ కంపెనీ ఈ వారం పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. 2018లో స్థాపితమైన ఈ సంస్థ, క్రోమ్‌ ప్లేటెడ్‌ ట్యాప్స్‌, షవర్లు, శానిటరీ వేర్‌, డోర్‌ హ్యాండిల్స్‌, ఏబీసీ ఫిట్టింగ్‌లు, సింక్‌లు వంటి ఉత్పత్తుల తయారీలో నిపుణత కలిగి ఉంది. దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించేందుకు అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా ఈ ఐపీఓను విడుదల చేస్తోంది. ఐపీఓ ద్వారా రూ.32.65 కోట్ల నిధులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కోసం రూ.66.63 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనుంది.

Details

గంగా బాత్‌ ఫిట్టింగ్‌ IPO వివరాలు 

ఐపీఓ ప్రారంభ తేదీ : 2025 జూన్‌ 4 ఐపీఓ ముగింపు తేదీ : 2025 జూన్‌ 6 ధర శ్రేణి : రూ.46 - రూ.49 షేర్ల కేటాయింపు తేదీ : 2025 జూన్‌ 9 లిస్టింగ్‌ తేదీ : 2025 జూన్‌ 11

Details

లిస్టింగ్‌కు సిద్ధంగా ఉన్న సంస్థలు

జూన్‌ 2 : లీలా ప్యాలెసెస్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ మాతృసంస్థ స్కూలాస్‌ బెంగళూరు లిమిటెడ్, ఏజిస్‌ వొపాక్‌ టెర్మినల్‌ జూన్‌ 3 : బ్లూ వాటర్‌ లాజిస్టిక్స్‌, ప్రొస్ట్రామ్‌ ఇన్ఫో సిస్టమ్స్‌, నికితా పేపర్స్‌, ఆస్టోనియా ల్యాబ్స్‌ జూన్‌ 4 : స్కోడా ల్యాబ్స్‌, నెఫ్ట్యూన్ పెట్రోకెమికల్‌, ఎన్‌ఆర్‌ వందనా టెక్స్‌టైల్‌ జూన్‌ 6 : 3బీ ఫిల్మ్స్‌ ఈ కంపెనీలు తమ ఆవిర్భావంతో స్టాక్‌ మార్కెట్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకురానున్నాయి. గమనించదగ్గ విషయమేమంటే, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు కూడా మార్కెట్‌లో తమ ఉనికిని చూపించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ లిస్టింగ్‌లు సూచిస్తున్నాయి.