LOADING...
Stock market: వరుసగా ఎనిమిదో రోజూ లాభపడిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 25,114
వరుసగా ఎనిమిదో రోజూ లాభపడిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 25,114

Stock market: వరుసగా ఎనిమిదో రోజూ లాభపడిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 25,114

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2025
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాంతంలో లాభాలతో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చని అంచనాలు, భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు మదుపరుల మనోభావాన్ని బలోపేతం చేశాయి. ఈ కారణంగా నిఫ్టీ వరుసగా ఎనిమిదో రోజూ లాభపడగా.. సెన్సెక్స్‌ గడిచిన ఐదు సెషన్లలోనూ లాభాలు నమోదు చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సూచీలలో దూకుడు చూపించాయి. దీనివల్ల మదుపరుల సంపద ఒక్క రోజులోనే సుమారుగా రూ.2లక్షల కోట్లు పెరగడంతో మొత్తం ₹459 లక్షల కోట్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సెన్సెక్స్ ఉదయం 81,758.95 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 81,548.73) లాభాలతో ప్రారంభమైంది.

వివరాలు 

అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ధర 66.76 డాలర్లు 

దాని తర్వాత రోజు మొత్తం అదే ఉత్సాహంతో కదలాడింది. ఇంట్రాడేలో 81,992.85 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ, చివరికి 355.97 పాయింట్ల లాభంతో 81,904.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 108.50 పాయింట్ల లాభంతో 25,114 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ కొద్దిగా కోలుకుని 88.26 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 30 సూచీలో బీఎల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు ఎటెర్నల్, హిందుస్థాన్ యూనిలీవర్, ట్రెంట్, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ధర 66.76 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 3,649 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.