Stock Market: భారీ నష్టాలలో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 700 పాయింట్లు డౌన్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు సూచీలపై తీవ్ర ఒత్తిడి తీసుకురాగా, మార్కెట్ ప్రారంభంలోనే సూచీలు గణనీయమైన నష్టాల్లోకి జారుకున్నాయి.
ముఖ్యంగా ఐటీ, మెటల్ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్‌ఎం, టీసీఎస్ వంటి ప్రధాన షేర్లలో విక్రయాలు పెరగడంతో మార్కెట్లు నష్టాల్లో కొనసాగాయి.
ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 723 పాయింట్లు క్షీణించి 73,888 వద్దకు చేరగా, నిఫ్టీ (Nifty) 210 పాయింట్లు పడిపోయి 22,334 వద్ద ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలోని అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 73.68 డాలర్లు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి షేర్లు ముఖ్యంగా నష్టాల్లో ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 73.68 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
బంగారం ధర ఔన్సుకు 2,880.60 డాలర్ల వద్ద కదలాడుతుండగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.33 వద్ద ఉంది.
వివరాలు
నష్టాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు
అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500, నాస్‌డాక్ సూచీలు దాదాపు 2 శాతం మేర తగ్గాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్లూ ఇదే దిశలో సాగుతున్నాయి.
ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 1 శాతం, జపాన్ నిక్కీ 2.18 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 2.22 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి.
షాంఘై సూచీ మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం నికరంగా రూ. 557 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ. 1,727 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.