Page Loader
Stock Market : లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు .. నిఫ్టీ@ 24,800 
లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు .. నిఫ్టీ@ 24,800

Stock Market : లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు .. నిఫ్టీ@ 24,800 

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
04:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సానుకూల సంకేతాల నేపథ్యంలో,సూచీలు ఉదయం నుంచే లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే ట్రేడింగ్‌ సమయంలో కొంతసేపు లాభానష్టాల మధ్య ఊగిసలాడాయి. ప్రధాన కంపెనీల షేర్లలో కొనుగోళ్లు కొనసాగడంతో సూచీలు మళ్లీ పుంజుకుని రోజంతా బలంగా నిలిచాయి. చివరికి మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 320 పాయింట్ల లాభంతో ముగియగా, నిఫ్టీ 24,800 పాయింట్లపై స్థిరపడింది. సెన్సెక్స్‌ ఉదయం 81,591.03 పాయింట్ల వద్ద లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది, గత ముగింపు స్థాయి 81,312.32 పాయింట్లతో పోలిస్తే ఇది స్పష్టమైన లాభమని చెప్పాలి. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్‌ 81,106.98 నుండి 81,816.89 పాయింట్ల మధ్య కదలాడింది.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌ ధర 65.84 డాలర్లు 

చివరికి ఇది 320 పాయింట్ల లాభంతో 81,633 వద్ద స్థిరమైంది. అదే సమయంలో నిఫ్టీ అత్యధికంగా 24,892.60 పాయింట్లను తాకింది. ట్రేడింగ్ ముగిసేసరికి నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో 24,833.60 వద్ద ముగిసింది. మరోవైపు,రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 85.50 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 సూచీలో భాగమైన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌,సన్‌ఫార్మా,అదానీ పోర్ట్స్‌,ఎటర్నల్‌,టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా,యాక్సిస్‌ బ్యాంక్‌,కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌,టాటా మోటార్స్‌,ఇన్ఫోసిస్‌,ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌,మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ముగిశాయి. అయితే మరోవైపు,బజాజ్‌ ఫైనాన్స్‌,ఐటీసీ,బజాజ్‌ ఫిన్‌సర్వ్‌,ఏషియన్ పెయింట్స్‌,టీసీఎస్‌,ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల పరంగా చూస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌ ధర 65.84 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ధర ఔన్సుకు 3,282 డాలర్ల వద్ద కొనసాగుతోంది.