Page Loader
Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @25,100 
లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @25,100

Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @25,100 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆర్‌ బి ఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించిన నిర్ణయం మార్కెట్‌కు బలాన్నిచ్చింది. ముఖ్యంగా బ్యాంకింగ్,ఫైనాన్షియల్ రంగాల షేర్లు మంచి ప్రదర్శన కనబర్చాయి. అలాగే భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో ప్రగతి,అమెరికాలో మెరుగైన ఉద్యోగ గణాంకాలు, అలాగే అమెరికా-చైనా మధ్య జరగబోయే వాణిజ్య చర్చలపై ఆశాజనక అంచనాలు మార్కెట్‌ను ఉత్సాహంగా మార్చాయి. ఈ ప్రభావంతో స్టాక్ సూచీలు వరుసగా నాల్గవ రోజు కూడా లాభాల్లోనే ముగియడంతో నిఫ్టీ 25,100 పాయింట్లకు పైగా స్థిరంగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో బీఎస్ఈ సెన్సెక్స్‌ ఉదయం 82,574.55 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది (మునుపటి ముగింపు 82,188.99).

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 66 డాలర్లు 

ఈ సూచీ సర్వదా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 82,669 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సెన్సెక్స్‌ చివరికి 256.22 పాయింట్లు పెరిగి 82,445.21 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీ కూడా 100 పాయింట్ల లాభంతో 25,103.20 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.63 వద్ద కొనసాగుతోంది.సెన్సెక్స్‌లోని 30ప్రధాన షేర్లలో కోటక్ మహీంద్రా బ్యాంక్,బజాజ్ ఫైనాన్స్,యాక్సిస్ బ్యాంక్,పవర్‌గ్రిడ్ కార్పొరేషన్,ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలతో ముగిశాయి. ఇక ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 66 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 3340 డాలర్ల వద్ద కొనసాగుతోంది.