
Stock market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,562
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం రోజున స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయంగా మార్కెట్ల నుండి భిన్న సంకేతాలు లభించడం వల్ల భారత మార్కెట్లు స్థిరంగానే కదులుతున్నాయి. ఉదయం 9.33 గంటల సమయంలో సెన్సెక్స్ 87 పాయింట్ల లాభంతో 83,790 స్థాయిలో ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 25,562 వద్ద కొనసాగుతోంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారక విలువ 85.62గా నమోదైంది.
వివరాలు
మిశ్రమ ధోరణిలో కదలాడుతున్న ఆసియా మార్కెట్లు
నిఫ్టీ సూచీలో భాగమైన ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈక్రమంలో, ఇండస్‌ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఇదే సమయంలో ఆసియా మార్కెట్లు కూడా మిశ్రమ ధోరణిలో కదలాడుతున్నాయి.