
stock market: మిశ్రమంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు.. నిఫ్టీ@ 24,962
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. ఈ రోజు ఉదయం 9.17 గంటల సమయానికి సెన్సెక్స్ 7 పాయింట్ల లాభంతో 81,764 వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 24,962 వద్ద ట్రేడవుతున్నాయి. కంపెనీల పరంగా చూస్తే.. హాట్సన్ ఆగ్రో, నవీన్ ఫ్లోరిన్, షేర్ ఇండియా సెక్యూరిటీస్, అలెంబిక్ ఫార్మా, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు, సీబీఎస్ బ్యాంక్, మంగళూరు రిఫైనరీ, సీక్వెంట్ సైంటిఫిక్, బంధన్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
వివరాలు
డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.86.32
అంతర్జాతీయ మార్కెట్లు కూడా మిశ్రమంగా సాగుతున్నాయి. ఆసియా-పసిఫిక్ మార్కెట్ల విషయానికొస్తే.. చైనాలోని షెన్‌జెన్, షాంఘై సూచీలు, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ, న్యూజిలాండ్ ఎన్‌జెడ్‌ఎక్స్ 50 సూచీ లాభాల్లో ఉన్నాయి. అయితే, ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్‌ఎక్స్ 200, తైవాన్ మార్కెట్ సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.86.32 వద్ద కొనసాగుతోంది. భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం తుదినిర్ణయ దశలో ఉన్న నేపథ్యంలో.. ఆ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపడే వరకు పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించే అవకాశముంది.