Page Loader
Swiggy IPO : స్విగ్గీ ఐపీఓ.. నవంబర్ 6 నుండి 8 వరకు సబ్‌స్క్రిప్షన్
స్విగ్గీ ఐపీఓ.. నవంబర్ 6 నుండి 8 వరకు సబ్‌స్క్రిప్షన్

Swiggy IPO : స్విగ్గీ ఐపీఓ.. నవంబర్ 6 నుండి 8 వరకు సబ్‌స్క్రిప్షన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 29, 2024
12:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత స్టాక్ మార్కెట్‌లోకి రాబోయే సరికొత్త ఐపీఓలో స్విగ్గీ ఐపీఓ అనేక ఆసక్తికర అంశాలను అందుబాటులోకి తీసుకొస్తుంది. నవంబర్ 6న ప్రారంభమవుతూ, నవంబర్ 8న ముగిసే ఈ ఐపీఓ ద్వారా స్విగ్గీ సుమారు రూ. 11,300 కోట్లను సమీకరించడం విశేషం. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ రూ. 371-రూ. 390 మధ్యలో ఉంటుందని నివేదికలు చెబుతున్నారు. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం నవంబర్ 5న ప్రత్యేక బిడ్డింగ్ విభాగం అందుబాటులో ఉంటుంది. స్విగ్గీ మొత్తం రూ. 11,300 కోట్ల ఐపీఓలో తాజా ఇష్యూ కింద రూ. 4,500 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి

Details

అమ్మకానికి రూ.6,800 కోట్ల విలువ చేసే షేర్లు

ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద రూ. 6,800 కోట్ల విలువ గల షేర్లు అమ్మకానికి వస్తాయి. ఈ OFSలో యాక్సెల్ ఇండియా IV (మారిషస్), అపోలెట్ ఆసియా, ఆల్ఫా వేవ్ వెంచర్స్, ఎలివేషన్ క్యాపిటల్ వంటి కంపెనీలు తమ వాటాలను విక్రయిస్తోంది. సాఫ్ట్ బ్యాంక్ ఈ విక్రయాలలో పాల్గొనడం లేదు. మొదటి దశ పెట్టుబడిదారులకు 35 రెట్లు రాబడి ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్కూట్సీ డార్క్ స్టోర్స్ విస్తరణకు రూ.982.40 కోట్లు, డార్క్ స్టోర్స్ ఏర్పాటుకు రూ.559.10 కోట్లు, లీజు చెల్లింపుల కోసం రూ.423.30 కోట్లు వినియోగించనున్నారు.

Details

మార్చి 2023 నాటికి 1.09 బిలియన్ డాలర్లు

టెక్నాలజీ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ.586.20 కోట్లు, బ్రాండ్ ప్రమోషన్ కోసం రూ.929.50 కోట్లు కేటాయించి, సంస్థ అభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నారు. స్విగ్గీ ప్రస్తుతం సుమారు 13 బిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీగా ఉంది. మార్చి 2023 నాటికి దాని వార్షిక ఆదాయం 1.09 బిలియన్ డాలర్లను దాటింది. ప్రస్తుతం 4,700 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉన్న ఈ సంస్థ, జొమాటో వంటి ప్రధాన పోటీదారులతో పటిష్టంగా నిలుస్తోంది. జొమాటో 2021లో స్టాక్ మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి మంచి వృద్ధిని సాధించింది. స్విగ్గీ ఐపీఓ గురించి ఉన్న ఆసక్తి ఈ లిస్టింగ్‌ని మరింత ఆసక్తికరంగా మార్చింది.