LOADING...
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. మూడు నెలల కనిష్ఠానికి నిఫ్టీ 
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. మూడు నెలల కనిష్ఠానికి నిఫ్టీ

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. మూడు నెలల కనిష్ఠానికి నిఫ్టీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కొనసాగుతున్ననష్టాల పరంపర కొనసాగుతోంది. రష్యా చమురు సంబంధ సమస్య పరిష్కారం వచ్చే వరకు భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండబోవంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. అదనంగా,విదేశీ సంస్థల (FII) వరుస అమ్మకాలు, Q1 ఫలితాలు మదుపరులను ఆకట్టుకోకపోవటం వంటి కారణాల వల్ల సూచీలు వరుసగా ఆరో వారమూ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,ఎయిర్‌టెల్ వంటి ప్రధాన షేర్ల అమ్మకాలు పెరగడంతో నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 24,400ను కోల్పోయి మూడు నెలల కనిష్ఠానికి చేరింది. మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో నమోదు చేసిన కంపెనీల మొత్తం మార్కెట్ మూల్యము రూ.5 లక్షల కోట్లు తగ్గి రూ.440లక్షల కోట్లకు దిగింది.

వివరాలు 

 రూపాయి-డాలర్ మారకం విలువ 87.71

సెన్సెక్స్ ఉదయం 80,478.01 పాయింట్ల వద్ద (గత ముగింపు: 80,623.26) నష్టాలతో ప్రారంభమై, రోజంతా నష్టాల్లో కదిలింది. ఇంట్రాడేలో 79,775.84 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరికి 765.47 పాయింట్ల నష్టంతో 79,857.79 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 232 పాయింట్ల నష్టంతో 24,363.30 వద్ద స్థిరపడింది. రూపాయి-డాలర్ మారకం విలువ 87.71గా ఉంది. సెన్సెక్స్ 30లో భారతీ ఎయిర్‌టెల్,టాటా మోటార్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టాలు చవిచూశాయి. ఎ న్టీపీసీ, టైటాన్, బజాజ్ ఫిన్‌సర్వ్, ట్రెంట్, ఐటీసీ మాత్రమే లాభాలపై కొనసాగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 66.99 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు ధర 3,387 వద్ద కొనసాగుతోంది.