LOADING...
TCS Layoffs: టీసీఎస్ కీలక నిర్ణయం.. సీనియర్ నియామకాలు,టీసీఎస్,వార్షిక జీతాలపెంపు బంద్.. 35 డేస్ డెడ్ లైన్ 
టీసీఎస్ కీలక నిర్ణయం.. సీనియర్ నియామకాలు,టీసీఎస్,వార్షిక జీతాలపెంపు బంద్..

TCS Layoffs: టీసీఎస్ కీలక నిర్ణయం.. సీనియర్ నియామకాలు,టీసీఎస్,వార్షిక జీతాలపెంపు బంద్.. 35 డేస్ డెడ్ లైన్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల తమ సంస్థ నుండి సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కంపెనీకి సంబంధించిన మరో సంచలనాత్మక సమాచారం 'ది ఎకనామిక్ టైమ్స్' నివేదికలో వెలుగులోకి వచ్చింది. అందులో చెప్పిన వివరాల ప్రకారం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇకపై అనుభవజ్ఞులైన నిపుణులను నియమించడాన్ని నిలిపివేయనుండటంతో పాటు, తమ గ్లోబల్ ఉద్యోగుల వార్షిక వేతన వృద్ధిని కూడా తాత్కాలికంగా ఆపనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసిన తర్వాత, ఇప్పుడు ఈ చర్యలు చేపట్టడంపై పరిశ్రమలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

వివరాలు 

35 డేస్ డెడ్ లైన్ 

ప్రస్తుతం టీసీఎస్‌లో క్లయింట్ ప్రాజెక్టులకు కేటాయించని (బెంచ్‌ పై ఉన్న) అనేకమంది ఉద్యోగులు ఉన్నారని సమాచారం. అలాంటి సిబ్బందిని తొలగించేందుకు సంస్థ కఠినమైన నిర్ణయానికి వెళ్లిందని తెలుస్తోంది. వీరికి ప్రాజెక్టులకు అనువైన అసైన్‌మెంట్లు కేటాయించడమో లేక కంపెనీని వీడడమో ఎంచుకునేందుకు 35 రోజుల గడువును సంస్థ ఇచ్చిందని నివేదిక పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్, పూణే, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల్లో ఈ ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తోంది.

వివరాలు 

సీనియర్ ఉద్యోగుల తొలగింపు వల్ల ఖర్చు తగ్గే అవకాశం 

ఒక సీనియర్ ఐటీ నిపుణుడి విశ్లేషణ ప్రకారం, టీసీఎస్ సీనియర్ ఉద్యోగులను తొలగించడం వల్ల కంపెనీకి సంవత్సరానికి రూ.2,400 కోట్ల నుండి రూ.3,600 కోట్ల మధ్య ఖర్చు తగ్గే అవకాశముందని అంచనా. ఖర్చుతో కూడిన ఒప్పందాల ప్రభావం, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఉత్పాదకత పెరుగుదల వంటివి కంపెనీలను తక్కువ సిబ్బందితో ఎక్కువ పని చేయించేందుకు ప్రేరేపిస్తున్నాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ అభిప్రాయపడింది.