
Gold Rates: మహిళలకు గుడ్ న్యూస్ .. తగ్గిన బంగారం ధరలు.. రూ. 2 వేలు పెరిగిన సిల్వర్ ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం ధరలు తగ్గి ఊరటనివ్వగా.. వెండి ధరలు మాత్రం అనూహ్యంగా పెరిగి ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ రోజు తులం బంగారం ధర రూ.110 తగ్గింది. ఇదిలా ఉండగా కిలో వెండి ధర ఏకంగా రూ.2000 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.9,977గా, 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ.9,145గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.91,450కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.99,770 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ,విశాఖపట్టణం నగరాల్లో కూడా ఇలాంటి ధరలే కొనసాగుతున్నాయి.
వివరాలు
రూ. 2 వేలు పెరిగిన సిల్వర్ ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,600గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,920 వద్ద కొనుగోలు, అమ్మకాల జరగుతోంది. అయితే వెండి ధరలు మాత్రం వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. కిలో వెండి ధర ఒక్కసారిగా రూ.2000 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ.1,27,000గా ఉంది. ఢిల్లీలో వెండి ధర మరింత ఎక్కువగా పెరిగింది. అక్కడ కిలో వెండి ధర రూ.4000 పెరిగి రూ.1,19,000 వద్ద ట్రేడ్ అవుతోంది.