Page Loader
#Newsbytesexplainer: చైనా ఏఐని చూసి వణుకుతున్న సిలికాన్​ వ్యాలీ ..అసలేంటి ఈ డీప్​సీక్​?
చైనా ఏఐని చూసి వణుకుతున్న సిలికాన్​ వ్యాలీ ..అసలేంటి ఈ డీప్​సీక్​?

#Newsbytesexplainer: చైనా ఏఐని చూసి వణుకుతున్న సిలికాన్​ వ్యాలీ ..అసలేంటి ఈ డీప్​సీక్​?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2025
03:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో చైనా ఒక పెద్ద సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ "డీప్‌సీక్" అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఏఐ మోడళ్లను రూపొందించి ప్రపంచం ముందుకు తెచ్చింది. ఈ వినూత్న ఆవిష్కరణ ప్రపంచంలోని అగ్రశ్రేణి ఏఐ కంపెనీలను, ముఖ్యంగా అమెరికా సిలికాన్ వ్యాలీలోని దిగ్గజ సంస్థలను హడలెత్తిపోతున్నాయి. ఈ పరిస్థితి అమెరికా టెక్ ఇండెక్స్ పతనానికి దారితీసింది.

వివరాలు 

డీప్‌సీక్ అంటే ఏమిటి? 

డీప్‌సీక్ తన ముఖ్యమైన ఏఐ మోడల్‌ను "డీప్‌సీక్ R1" అని పిలుస్తోంది. ఈ సంస్థను 2023లో లియాంగ్ వెన్‌ఫెంగ్ అనే ఇంజినీర్, ఎంటర్‌ప్రెన్యూర్ స్థాపించారు. ఆయన ఆర్థిక డేటాను విశ్లేషించడంలో ఏఐని ఉపయోగించే హెడ్జ్ ఫండ్‌కు ముందు నాయకత్వం వహించారు. ఇప్పుడు లియాంగ్ బృందంలో చైనా విశ్వవిద్యాలయాల నుండి గ్రాడ్యుయేట్లు ఉంటున్నారు. ఈ బృందం ఓపెన్‌సోర్స్ ఏఐ మోడల్స్‌ను డెవలప్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలపర్లకు అందిస్తోంది.

వివరాలు 

డీప్‌సీక్ vs ఓపెన్‌ఏఐ 

డీప్‌సీక్‌ను చాట్‌జీపీటీ వంటి మోడళ్లతో పోల్చుతూ దీని ప్రత్యేకతలు పరిశీలిస్తున్నారు. డీప్‌సీక్ ఆర్‌1 ప్రాంప్ట్‌కు సమాధానం చెప్పడానికి ముందు రీజనింగ్ కూడా ఇస్తుంది. ప్రధానంగా ఇది తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యాన్ని కలిగించే మోడల్‌గా నిలుస్తుంది. డీప్‌సీక్ సక్సెస్: డీప్‌సీక్ అతి తక్కువ వ్యయంతో అత్యుత్తమ మోడల్స్ రూపొందించడంలో విజయం సాధించింది. ఇది మ్యాథ్స్, జీకే, క్యూఎండ్‌ఏ అంశాల్లో విశిష్టమైన ఫలితాలు ఇచ్చే సామర్థ్యం కలిగి ఉంది.

వివరాలు 

ఆపిల్​లో టాప్​- ఆ వెంటనే సైబర్​ దాడి.. 

అమెరికాలో ఆపిల్ యాప్ స్టోర్‌లో డీప్‌సీక్ ఆర్‌1 చాట్‌జీపీటీని అధిగమించి ఫ్రీ యాప్స్‌లో టాప్‌లో నిలిచింది. అయితే, దీని డౌన్‌లోడ్స్ అధికం కావడంతో యాప్ క్రాష్ అయ్యింది. వెంటనే దీనిపై సైబర్ దాడులు జరిగాయి, ఫలితంగా రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేశారు. అమెరికా ఆందోళనలు: అమెరికా, చైనాపై ఉన్న సాంకేతిక పరిమితులను మరింత పెంచే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ, చైనా ఇంజనీర్లు తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఏఐ మోడల్స్ రూపొందించడం అమెరికాకు పెద్ద సమస్యగా మారింది.

వివరాలు 

ఎన్‌విడియా షాక్: 

డీప్‌సీక్ విజయంతో ఎన్‌విడియా స్టాక్ 17% పడిపోయింది. ఎందుకంటే పెద్ద డేటా, టెక్ అవసరం లేకుండా ఏఐ మోడల్స్ రూపొందించవచ్చు అనే స్పష్టత అందరికీ వచ్చింది. డీప్‌సీక్ లోపాలు: డీప్‌సీక్‌ చైనా కంపెనీ కావడం దాని ప్రధాన లోపంగా గుర్తించబడుతోంది. చైనా యాప్స్ భద్రతపై ఎప్పుడూ అనుమానాలు ఉంటాయి. మరింతగా, చైనా సంబంధిత సున్నితమైన అంశాలపై ఈ ఏఐ మోడల్ సెన్సార్‌షిప్ విధానాలను అనుసరిస్తుంది.