Page Loader
Indian Air Force : 'హంటర్ కిల్లర్' ని కొనుగోలు చేస్తోన్న భారత్.. వణుకుతున్న శత్రుదేశాలు
'హంటర్ కిల్లర్' ని కొనుగోలు చేస్తోన్న భారత్.. వణుకుతున్న శత్రుదేశాలు

Indian Air Force : 'హంటర్ కిల్లర్' ని కొనుగోలు చేస్తోన్న భారత్.. వణుకుతున్న శత్రుదేశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2024
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన డ్రోన్ MQ -9B ప్రిడేటర్ అని చెప్పొచ్చు. ఇలాంటి 31 డ్రోన్‌లను అమెరికా నుంచి భారతదేశం త్వరలోనే కొనుగోలు చేయనుంది. చైనా-పాకిస్థాన్ తమ సాయుధ డ్రోన్ నౌకలను బలోపేతం చేస్తున్నాయి. ఈ తరుణంలో MQ -9B 'హంటర్ కిల్లర్' విమానాల కొనుగోలు కోసం భారతదేశం వేగంగా చర్చలను జరుపుతోంది. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ నాటికి మెగా డీల్‌ను పూర్తి చేయాలని భావిస్తోంది.

Details

40వేల అడుగుల ఎత్తులో ప్రయాణించనున్న MQ -9B ప్రిడేటర్

నేవి గరిష్టంగా 15 డ్రోన్‌లను పొందిన తర్వాత ఆర్మీ 8, ఎయిర్ ఫోర్స్ 8 రాబోతున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాల తెలిపాయి. ఇక పాకిస్థాన్ చైనా నుంచి మరో 16 సాయుధ సిహెచ్-4 డ్రోన్‌లను కోరినట్లు తెలిసింది. ఇప్పటికే ఏడు సిహెచ్-4 డ్రోన్‌లు, నావికాదళంలో మూడు ఉన్నట్లు తెలిసింది. MQ -9B ప్రిడేటర్ B డ్రోన్ 40,000 అడుగుల ఎత్తులో దాదాపు 40 గంటల పాటు ప్రయాణిస్తాయి. వీటిలో హెల్‌ఫైర్, గ్రౌండ్ క్షిపణులు, దాడుల కోసం స్మార్ట్ బాంబులను అమర్చవచ్చు.

Details

డీల్ పూర్తి చేయడానికి ప్రణాళికలు

ఇవి చైనీస్ సాయుధ డ్రోన్ ల కంటే బలంగా ఉంటాయి. 31 సాయుధ MQ-9B డ్రోన్‌లు, సంబంధిత పరికరాల కోసం అమెరికా 33,500 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఖర్చును తగ్గించుకొనే దిశగా భారత్, అమెరికాతో చర్చలు జరుపుతోంది. ఇందులో నావిగేషన్ సిస్టమ్‌లు, 310 GBU-39B ప్రెసిషన్-గైడెడ్ గ్లైడ్ బాంబులు, 170 హెల్‌ఫైర్ క్షిపణులు, సెన్సార్ సూట్‌లు, మొబైల్ గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి క్యాబినేట్ కమిటీ నుండి తుది ఆమోదం పొందిన తర్వాత ఈ ఏడాదిలోనే డీల్ పూర్తి చేయాలని చూస్తున్నారు.