Stock market: భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market) ఈరోజు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్, ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో గణనీయంగా దిగజారింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విధానాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో నెలకొన్న అనిశ్చితి మార్కెట్ పతనానికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రభావంతో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టాన్ని నమోదు చేస్తుండగా, నిఫ్టీ 24,000 స్థాయిని కిందికి దాటింది.
నిఫ్టీ 297.30 పాయింట్లు తగ్గి 23,977.60 వద్ద
మధ్యాహ్నం 1:20 గంటల సమయానికి, సెన్సెక్స్ 1,007.09 పాయింట్ల నష్టంతో 79,226.99 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 297.30 పాయింట్లు తగ్గి 23,977.60 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 సూచీలలో, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌ను మినహాయించి, మిగతా అన్ని స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, టీసీఎస్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి.