VIjay Devarakonda: 100 కుటుంబాలకు రూ. లక్ష చొప్పున అందజేస్తా: దేవరకొండ
ఈ వార్తాకథనం ఏంటి
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమాకు మంచి కనెక్షన్లు రావడంతో చిత్ర బృందంతో ఆనందంతో పొంగిపోతోంది.
ఇప్పటికే ఈ షినిమా మూడు రోజులలో 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 100 కోట్ల కబ్ల్ కి చేరువైంది.
ఈ తరుణంలో హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికర ప్రకటన చేశాడు.
తన రెమ్యూనరేషన్ నుంచి రూ. కోటి ఇవ్వనున్నట్లు విశాఖపట్నంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో వెల్లడించారు.
ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చిందని, అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.
Details
కొందరు డబ్బులిచ్చి ఫేక్ ప్రచారాన్ని చేశారు
ముఖ్యంగా ఖుషి సినిమా ఫేక్ రివ్యూలను, తప్పుడు ప్రచారాన్ని అధిగమించి విజయవంతంగా ఆడటానికి అభిమానులే కారణమని, కొందరు డబ్బులిచ్చి మరీ ఖుషి చిత్రంపై వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారని విజయ దేవరకొండ ఆరోపించారు.
అభిమానుల ముఖాల్లో ఆనందం చూడలనే కోరిక ఈ సినిమాతో తీరిందని, ప్రతి ఒక్కరితో ఆనందం పంచుకోవడానికి సాధ్యం కాలేదని, అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ. లక్ష ఇస్తానని విజయ్ చెప్పారు.
హైదరాబాద్‌లో త్వరలో సక్సెస్ ఈవెంట్ ను నిర్వహిస్తామని, ఆ ఈవెంట్ కు ముందే 100 కుటుంబాలను కలిసి ఈ చెక్కులను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.