Page Loader
Surya: సూర్య రిజెక్ట్ చేసిన తెలుగు సినిమాలు ఏంటో తెలుసా..
సూర్య రిజెక్ట్ చేసిన తెలుగు సినిమాలు ఏంటో తెలుసా..

Surya: సూర్య రిజెక్ట్ చేసిన తెలుగు సినిమాలు ఏంటో తెలుసా..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2024
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సినిమా పరిశ్రమలో ఎంతో పేరు సంపాదించిన హీరో సూర్య. కొన్ని సూపర్ హిట్ తెలుగు సినిమాలను రిజెక్ట్ చేయడం వల్ల అవి ఇతర హీరోలకు మంచి అవకాశంగా మారాయి. ఈ సినిమాలు కేవలం తమిళ సినిమాలే కాకుండా తెలుగు, మలయాళ భాషల్లో కూడా ఘన విజయాలను అందుకున్నాయి. సూర్య వదులుకున్న కొన్ని టాప్ 5 బ్లాక్ బస్టర్ సినిమాల గురించి తెలుసుకుందాం!

#1

మగధీర 

దర్శకుడు రాజమౌళి "మగధీర" సినిమాను ముందుగా సూర్యతో చేయాలని భావించారు. కానీ సూర్యకు కథ అంతగా నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తర్వాత ఈ సినిమాలో రామ్ చరణ్ నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను రిజెక్ట్ చేసినందుకు సూర్య పలు సందర్భాల్లో పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు.

#2

బిజినెస్ మ్యాన్ 

దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందించిన ఈ సినిమా కోసం మొదట సూర్యను సంప్రదించారు. "బిజినెస్ మ్యాన్" తెలుగులో మహేష్ బాబు నటించి సూపర్ హిట్ అందుకున్నారు. రెండు భాషల్లో ఒకేసారి షూట్ చేయాలని భావించిన ఈ ప్రాజెక్ట్, చివరకు మహేష్ చేతిలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

#3

తుపాకి

మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా మొదట సూర్యకు ఆఫర్ చేశారు. కానీ కథ పూర్తిగా నచ్చకపోవడంతో సూర్య ఈ ప్రాజెక్ట్‌ను వదులుకున్నాడు. అనంతరం విజయ్ హీరోగా ఈ సినిమా విడుదలై భారీ విజయాన్ని సాధించింది.

#4

ఆవారా

లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదట సూర్య కోసం ప్లాన్ చేయబడింది. సూర్య ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, చివరికి కొన్ని కారణాల వల్ల అతని తమ్ముడు కార్తీ ఈ సినిమాలో నటించాడు. ఆవారా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

#5

ది గోట్ లైఫ్ (ఆడు జీవితం)

ఈ మలయాళ సినిమా కూడా మొదట సూర్యను హీరోగా అనుకున్నారు. కానీ అప్పటికే ఉన్న కమిట్‌మెంట్స్ వల్ల సూర్య ఈ ప్రాజెక్ట్‌ను వదులుకున్నాడు. పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా, విడుదల తర్వాత మంచి విజయం సాధించి అరుదైన రికార్డులను కూడా సాధించింది. ఇలా, సూర్య వదులుకున్న కొన్ని సినిమాలు ఇతర హీరోలకు బ్లాక్ బస్టర్ విజయాలను అందించాయి.