Page Loader
Actor Nagarjuna : బౌన్సర్ల అతి, తన అభిమానికి నాగార్జున క్షమాపణ 
Actor Nagarjuna : బౌన్సర్ల అతి, తన అభిమానికి నాగార్జున క్షమాపణ

Actor Nagarjuna : బౌన్సర్ల అతి, తన అభిమానికి నాగార్జున క్షమాపణ 

వ్రాసిన వారు Stalin
Jun 24, 2024
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ అగ్ర నటుడు, హీరో అక్కినేని నాగార్జున మరో సారి తన దైన శైలిలో మన్ననలు పొందారు. కొందరు హీరోలైతే దగ్గరికి వస్తే అభిమానులపై చేయి చేసుకున్న నటులను చూశాం. అయితే ఆయన హుందాగా వ్యవహరించి కింగ్ లా మన్ననలు పొందారు.దీనికి సంబంధించిన వివరాలిలా వున్నాయి. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్న ఆయనను కలిసేందుకు ఓ అభిమాని ప్రయత్నించగా.. పక్కనే ఉన్న బౌన్సర్లు అతిగా ప్రవర్తించారు. సదరు అభిమానిని నిర్దయగా పక్కకు ఈడ్చి పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో నాగార్జున స్పందించారు.

వివరాలు 

క్షమాపణ చెప్పిన నాగార్జున 

విషయం తన దృష్టికి వచ్చిందని, ఇలా జరిగి ఉండకూదని విచారం వ్యక్తం చేశారు. ''ఆ వ్యక్తికి నేను క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో ఇలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానని చెబుతున్నాను !!'' అని నాగార్జున పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాగార్జున చేసిన ట్వీట్