LOADING...
Vishal engagement : హీరోయిన్ సాయి ధన్సికతో హీరో విశాల్ నిశ‍్చితార్థం
హీరోయిన్ సాయి ధన్సికతో హీరో విశాల్ నిశ‍్చితార్థం

Vishal engagement : హీరోయిన్ సాయి ధన్సికతో హీరో విశాల్ నిశ‍్చితార్థం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ స్టార్ హీరో విశాల్ త్వ‌ర‌లో ఓఇంటివాడు కాబోతున్నాడు.నటి సాయి ధన్సికతో ప్రేమలో ఉన్నానని,త్వరలో పెళ్లి చేసుకుంటామ‌ని గ‌తంలో ప్ర‌క‌టించాడు కూడా. నేడు,(శుక్రవారం,ఆగస్టు 29),విశాల్-సాయి ధన్సిక ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ ప్రత్యేక వేడుక చెన్నైలోని విశాల్ నివాసంలో అత్యంత సన్నిహితులు,కుటుంబ సభ్యుల సన్నిధిలో ఘనంగా జరిగింది. కాగా..నేడు విశాల్ పుట్టిన రోజు అన్న సంగ‌తి తెలిసిందే.ఎంగేజ్‌మెంట్ కి సంబంధించిన ఫోటోలు విశాల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారగా నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. సినిమాల విషయానికి వస్తే,ప్రస్తుతం విశాల్ "మకుటం"అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈసినిమా రవీ అరసు దర్శకత్వంలో రూపొందుతోంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఆర్బీ చౌదరి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.చిత్రంలో అంజలి,దుషార విజయన్‌లు కథానాయికలుగా నటిస్తున్నారని సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విశాల్ చేసిన ట్వీట్