Kamal Haasan: ఇకపై నన్ను అలా పిలవొద్దు.. అభిమానులు,మీడియాను అభ్యర్థించిన కమల్ హాసన్
సినీరంగంలో అగ్ర కథానాయకుడిగా వెలుగు వెలిగిన కమల్ హాసన్ (Kamal Haasan) ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తనను ఎలాంటి "స్టార్" ట్యాగ్స్‌తో పిలవవద్దని, కేవలం "కమల్" లేదా "కమల్ హాసన్" అని మాత్రమే పిలవాలని ఆయన నిర్ణయించారు. తనకు మరెన్నో అద్భుతమైన చిత్రాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన ఈ విషయాన్ని సోమవారం ఎక్స్ వేదికపై పోస్ట్ చేసి వెల్లడించారు.
కమల్ హాసన్ చేసిన ట్వీట్
కమల్ హాసన్ ఏమన్నారంటే..
"నా వర్క్‌కి మెచ్చి 'ఉలగనాయగన్' వంటి ఎన్నో బిరుదులను అందించినందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని. ప్రేక్షకులు, తోటి నటీనటులు, ఆత్మీయుల నుంచి వచ్చే ఇలాంటి ప్రశంసలు నా మనసుని తాకాయి. ఈ ప్రశంసలు నన్ను కదిలించాయి. సినిమా అనేది ఏ ఒక్కరి ఊహకు అందని విషయంతో నిండింది. నేను ఎప్పటికీ నిత్య విద్యార్థిని. సినిమా రంగంలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, మరింత ఎదగాలని ఆశిస్తున్నాను. ఇంతకు మించి, సినిమా అందరికీ చెందినది. అనేక కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు సహకరించి, గొప్ప కథలు చెప్పే ప్రతిబింబమే సినిమా.
కమల్ హాసన్ ఏమన్నారంటే..
కళ కంటే కళాకారుడు గొప్ప కాదని నా నమ్మకం. నా లోపాలను గుర్తించి, వాటిని మెరుగుపరుస్తూ నటుడిగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ప్రయత్నిస్తాను. ఆలోచించి, ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఇకపై 'స్టార్' ట్యాగ్స్‌ను మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తాను. నా అభిమానులు, మీడియా, సినీ ప్రముఖులు, భారతీయులందరూ నన్ను కేవలం 'కమల్ హాసన్' లేదా 'కమల్' లేదా 'కె.హెచ్.' అని పిలవాలని అభ్యర్థిస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా మీరు చూపించిన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. నా మూలాలకు నేను కట్టుబడి, నటుడిగా నా బాధ్యతను నిర్వహించాలని ఆశిస్తున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని ఆయన అన్నారు.
ఇతర నటులందరి నిర్ణయాలు..
కమల్ హాసన్ తీసుకున్న ఈ నిర్ణయం కొత్తది కాదు. కోలీవుడ్‌లో అజిత్ ఇప్పటికే తనను కేవలం 'అజిత్ కుమార్' లేదా 'అజిత్', 'ఏ.కే.' అని పిలవమని ప్రకటించారు. అలాగే, తెలుగులో కూడా నటి నాని 'స్టార్' ట్యాగ్స్‌పై వ్యతిరేకత వ్యక్తంచేసి, తనను 'నేచురల్ స్టార్' అని కాకుండా కేవలం 'నాని' అని మాత్రమే పిలవమని సూచించారు.